|
దక్షిణానిలము లుద్ధతి నేడు తెఱఁగుల
పెరిగెడు గాడ్పులై పెల్లగింపఁ
[1]గెంజాయ దిక్కులఁ బింజించు చిగురులు
కాలానలార్చులై కాఁకఁ బెనుప
నళిశుకపికగర్జ లడరఁ బూదేనియ
ఘోరాంత్యవృష్టియై [2]కురిసి కలఁప
|
|
తే. |
విరహవేదన లెసఁగి యుద్వేలగతుల
నద్భుతముగ నేకార్ణవ మగుచు ముంప
నఖిలసుఖకారి యగు వసంతాగమంబు
పథికలోకంబునకు మహాప్రళయమయ్యె.
| 53
|
చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-61]
ఉ. |
పండినయాకు డుల్లి నవపల్లవముల్ తిలకింపఁ బూఁబొదల్
నిండఁగఁ బర్వె లేఁగొనలు నిద్ధములై నిగుడంగ మాకు లొం
డొండఁ దలిర్చె నామని సముజ్జ్వల[యోగరసాదనక్రియన్]
గొండిక పాయముల్ మగుడఁగోరి భజించిన సిద్ధులో యనన్.
| 54
|
చ. |
గ్రహణ మొనర్చినన్ వృకలికాపుకొలంకము లీనఁజేయుచున్
రహినటవీవధూటి ననురాగరసంబునఁ దెల్పు సత్కళా
+ + + + + + + + + + + + + + + ++ + + + + ++
మహితవిభూతి నంత మధుమాసము వచ్చె విలాసికైవడిన్.
| 55
|
చ. |
నవమధువాసవుండు విపిన[3]స్థితభూధరపర్ణపక్షముల్
జవమున మందమారుతనిశాతపవిం దెగవైవఁ దద్రణో
ద్భవరుధి[4]రౌఘముల్ మృదులపల్లవజాలములందె దుర్మతుల్
భువి నెఱుగంగరాదు పికభూతములుం దనియంగఁ బూయగన్.
| 56
|
చ. |
సమజమనోజపార్థుఁడు వసంతవిరాటసుతుండు తోడుగా
నమితవనీశమీతరుగతాయుధసంభృతవర్ణచర్మసం
ఘము వెడలించి యా చిగురుఁగైదువు లుద్ధతిఁ బూని యేసె దు
త్తుమురుగ మానగోగ్రహణథూర్వహపాంథకురుప్రవీరులన్.
| 57
|
- ↑ చ.గంజాత
- ↑ చ.చ.కుదిచి
- ↑ చ.వృతు
- ↑ కాఖముల్