|
అఖిలతరులు చలి నంతర్భవించెఁబో
కాదేని చలికడ గానరాదె
|
|
తే. |
యగరుమాంజిష్టపటము ప్రియాంకనాంగ
సంగతియు నిచ్ఛ గల భాగ్యశాలి దక్క
మనుజు లీచలి నేమని మనుట గలుగు
ననఁగ శిశిరంబు భువనంబు లాక్రమించె.
| 43
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-32]
తే. |
స్థావరములైన యద్రులుఁ జలికి వెఱచి
యీడు మీఱిన సానులతోడికూట
ములు విసర్జింపలేవన్నఁ దలప నొరులు
సతులఁ బాసి చరింపంగఁజాలఁగలరె.
| 44
|
[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-39]
క. |
చెప్ప [2]నశక్యంబగు చలి
యుప్పతిలం బాలవృద్ధయువజనములకున్
దప్పక శరణము లయ్యెన్
గుప్పసములు ముర్మురములుఁ గుచకుంభములున్.
| 45
|
తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము
క. |
పెదవియుఁ బెదవియు నుదురును
నుదురును [3]గేల్ గేలు పదమునుం బదము నొగిన్
గదియించి సంధిఁ బెరుగు ప
గిది నొదిగిరి సతులుఁ బతులు కేలిగృహములన్.
| 46
|
ఉ. |
ప్రక్కలు వంచి వంచి మునిపండ్లును బండ్లును రాచి రాచి రొ
మ్మక్కిలఁ జేసి చేసి తల యల్లనఁ గాళ్ళుల సంది లోనికిం
[4]జక్కికి నొక్కి నొక్కి యిరుచంబడఁ గుమ్మడి మూటగట్టి వీఁ
పెక్కి గువాళిసేయు చలి యిక్కడ నక్కడఁ బోక వేఁకువన్.
| 47
|
- ↑ సుంకిసాల
- ↑ చ.నసబ్బంబగు
- ↑ చ.కెంగేలు
- ↑ చ.జెక్కిలి