Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              వారిపైఁ బొట్టలు వాచి తేలె
మృగతృష్ణనీళ్ళని మృగసంఘ మెదురేఁగి
              నొగిలి నల్దెసలకు నోళ్ళు దెఱచె
నాకాశచరకోటి యాతపంబునఁ గ్రాఁగి
              నింగి నిల్వఁగ లేక నేలఁ గూలె


తే.

నింకె నదనదీకూపంబు లెండెఁ [1]జెఱువు
లుండలేరైరి నరులెల్ల నుబ్బచేత
గుంది పథికులు మ్రాఁకులక్రిందఁ బడిరి
కడు భయంబున వీవరి (?) గాడ్పు లెసఁగ.

[?]

చ.

మృడు నయనాగ్నిఁ గ్రోలి హరు మేచకకంఠముమీఁద వ్రాలి య
జ్జడనిధి బాడబానలము చక్కటిఁ దేలి [2]దవప్రభూతముల్
తడఁబడి తోలి తేలి బెడిదంబగు వేఁడిమితోడ వచ్చె న
ప్పడమటిగాలి లోకముల ప్రాణుల జాలి నిదాఘవేళలన్.

12

వర్షఋతువు

పెద్దిరాజు – అలంకారము [3-103]

క.

తటి[3]దటన మేఘపటలీ
ఘటితాంబర[4]శక్రచాపకరకా[5]వ్రాత
స్ఫుటధారాసాదాదివి
కటత నుతింపంగవలయు ఘన[6]కాలమునన్.

13


మ.

చపలా[7]లోకములన్ బయోధరగరిష్ఠశ్రీయు [8]సద్యోల్లస
ద్విపులానందము నంబరాభరణసద్వేషంబునుం [గంకణ
స్థ][9]పుటారావము [10]సొంపు మీఱఁ దగు వర్షావేళ విశ్వేశ్వరా
[ధిపు] సేవించు ప్రగల్భకామినిగతిం [11]దీపించు [12]భావింపఁగన్.

14

[13]చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-16]

చ.

కరములు చాఁపి [14]వడ్డిడుటకై బుధశుక్రుల సాక్షివెట్టి య
య్యరుణుఁడు భూమిచేతఁ దగ నప్పులు [15]గైకొని యియ్యకున్నచో

  1. చ.దరువు
  2. చ.దవిప్రభాతముల్
  3. చ.తటన
  4. చ.చక్ర
  5. చ.వాతా
  6. చ.కాయమునన్
  7. చ.లోలము
  8. చ.నన్నొ
  9. చ.కుటీలాపము
  10. చ.నొప్పు
  11. చ.దీపించి
  12. చ.భావించినన్
  13. చలికొండ
  14. చ.పట్టిడుటకై
  15. చ.పుచ్చుకొ