Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

క.⁠

శ్రీరమణీరమణీయకృ
పారాజదపారకలశపారావారా
చారుతరలోచనీకృత
నీరజవనమిత్రభేశ నీలాద్రీశా!

⁠ 1


వ.⁠

దేవా! సూర్యోదయాదివర్ణనంబులు విన్నవించెద నాదరింపుము.

⁠ 2

సూర్యోదయము

పెద్దిరాజు – అలంకారము [3-113]

క.⁠

[1]ఎచ్చటఁ జూచిన జగముల
నచ్చటనె వెలుంగు [2]నవియు నజహరిహర[3]తా
సచ్చతురుఁ డనియు మఱియును
నిచ్చకుఁ దగఁ బొగడవలయు నిను నుదయంబున్.

⁠ 3

[3-114]

మ.⁠

కమలామోద మెలర్ప నేత్ర[4]సుఖదాకారంబు రంజిల్ల ను
త్తమవందారుశివంక[5]రత్వ మెసఁగన్ ధర్మార్థకామక్రియా
దిమ[6]మూలం బన [7]నొప్పు మిత్రుఁ [8]డుదయోత్సేకప్రభావంబుచే
సముఁ డద్దేవున కిందువంశజుఁడు త[9]చ్చంచద్గుణశ్రేణులన్.

⁠ 4

ముక్కు తిమ్మన – పారిజాతము [4-49]

సీ.⁠

[10]మొగుడుఁదమ్ములఁ జిక్కు మగతేఁటియలుఁగులు
              సడలిపోఁజేయు విశల్యకరణి
కాలవశంబునఁ గడసన్న వాసర
              శ్రీఁ గ్రమ్మఱించు సంజీవకరణి
రే యను వాలునఁ [11]బాయలైన రథాంగ
              తతుల హత్తించు సంధానకరణి
తిమిరంబుచే సొంపు సమసినదిశలకు
              వన్నియ నొసఁగు సౌవర్ణకరణి

⁠


తే.⁠

మించు [12]బీఱెండ యగ్నిఁ బుట్టించు సరణి
కలుషఘోరపయోరాశిఁ [13]గడపు [14]తరణి

⁠
  1. ↑ చ.అచ్చట
  2. ↑ చ.ననియని
  3. ↑ చ.కాణచ్చరియుడని
  4. ↑ చ.సుకరా
  5. ↑ చ.రత్న
  6. ↑ చ.మూలంబున
  7. ↑ చ.నొప్ప
  8. ↑ చ.నుదయో
  9. ↑ చ.చంచెత
  10. ↑ చ.మొగులు
  11. ↑ చ.జాయ
  12. ↑ చ.నీరెండ
  13. ↑ చ.గుడుపు
  14. ↑ చ.సరగి