Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము

[1]చ.

ముదముఁ దలిర్పఁ జిత్తినికి ముందటి ఝామునఁ గూడఁ జాల సం
మదము వహించు హస్తిని క్రమంబున రెండవ ఝామునందు నిం
పొదవఁ దృతీయఝాము రతియోగము శంఖిని కంత పద్మినీ
ముదితకు నంత్యయామమున మోహము పుట్టు నహర్నిశంబునన్.

151

నారాయణదేవుఁడు – మదనకళాభిరామము

[2]చ.

తలకొని యంగుటంబును బదంబును గుత్తియు జానువుల్ విని
ర్మలజఘనంబు నాభియు నురంబుఁ గుచంబును బాహుమూలముల్
గళమును జెక్కుమోవియును గన్నలికంబుఁ దిరంబు నెక్కు కాం
తల వలదిక్కు వెన్నెలను దర్పకుఁ డివ్వల డిగ్గుఁ జీకటిన్.

152

అలుకలు

ముక్కు తిమ్మన – పారిజాతము [1-99]

[3]ఉ.

మాసిన చీర గట్టికొని మౌనముతోడ నిరస్తభూషయై
వాసెనకట్టు కట్టి నిడువాలిక కస్తురిబొట్టు వెట్టి లో
గాసిలి చీఁకటింటి కడకంకటిపై జలదాంతచంద్రరే
ఖాసదృశాంగియై పొరలె గాఢమనోజవిషాదవేదనన్‌.

153

[4]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [4-150]

[5]ఉ.

[6]పట్టకు పట్ట కేల ననుఁ బట్టెద వోరి బిగించి కౌఁగిటన్
బట్టెదవే వృధా యెరియఁ బట్టగు నీకయి మత్కుచద్వయీ
ఘట్టనచేత నిప్పు డెఱుఁగం దలపోయవుగాక యెవ్వతెన్
బెట్టినవాఁడవో హృదయపీఠిక దానికి నొత్తుడౌఁజుమీ.

154

[4-152]

[7]క.

[8]తలఁపెత్తి యొండు పేరన్
బిలిచినఁ దప్పేమి నీకుఁ బ్రియమగు సతిగాఁ
దలఁచుట చాలదె నాక
ప్పొలతుక నామంబుఁ దాల్చు పుణ్యము గలదే.

155

కానుకొల్లు అన్నమరాజు - అమరుకము

[9]ఉ.

ఏమిటి కింతలేసి హృదయేశ్వరి ముద్రుఁడ వోలె నాలుగో
ఝామున వచ్చి పాదజలజాతము లొత్తెద వక్కటా భవ

  1. క.లో లేదు.
  2. క.లో లేదు.
  3. క.లో లేదు.
  4. సుంకసాల
  5. క.లో లేదు.
  6. గ.పట్టెదకేలు నిన్నదను బట్టెదకోలి
  7. క.లో లేదు.
  8. గ.తలయెత్తి
  9. క.లో లేదు.