Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              తన మూర్తి నొకట రథంబు సేసి
కనుదోయిఁ జక్రయుగ్మముగ యోజన సేసి
              సమత నూరుపుల నశ్వములఁ జేసి


తే.

యన్నియును నీ యధీనంబు లగుటఁ జేసి
పురము లేసితిగాక నీ కొరులు తోడె
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!

48


సీ.

కాంతులఁ జూపట్టు కండ్లమరించిన
              తిరమైన విపులపుఁ దేరునందు
విద్యల [1]ప్రోడయౌ వృద్ధసారథి నిల్పి
              యతఁడు శిక్షించు హయములఁ బన్ని
[2]వన్నెవాసుల మించు తిన్నని [3]రావిల్లు
              చొక్కు[టఁ] బై నారి నెక్కువెట్టి
గఱితోడఁ గూడ నాకసపుఁ [4]బ్రసూతి నీ
              ళ్ళమ్మొనఁ బదనిచ్చు నమ్ముఁ దొడిగి


తే.

యమరభటు లార్వ దైత్యపురములు గెడపి
విజయ మొందిన జోద వీ విశ్వమునను
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ!

49

రంగనాథుఁడు

చ.

అదలని తేరు తేరునకు నాదరువై[5] తగు విల్లు వింటికిన్
గుదురగు నారి నారిపయిఁ [6]గున్కు శరంబు శరంబు బొడ్డునన్
బొదలిన యంత యంత ముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
చెదరక నీకు [7]నెట్లు పనిసేయునయా! [8]గిరిజేశనాయకా!

50

అర్ధనారీశ్వరము

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత [1-29]

సీ.

పులితోలు [9]రెంటెంబు వెలిపట్టు [10]గెంటెంబుఁ
              గటిమండలంబున గరిమఁ దనర
భసితాంగరాగంబు బహుగంధయోగంబు
              బాహుమధ్యంబునఁ బరిఢవింప
శీతాంశునవకాంతి సేమంతి పూబంతి

  1. ట. ప్రోఁక
  2. ట. తన్నివాసుల
  3. ట. ప్రావిల్లు
  4. ట. నూటిని బాగు నెమ్మేనుఁ బస నిచ్చు
  5. క. వైన
  6. ట. గూన్కు
  7. ట. నెట్టి
  8. క. శిరికేశ, ట. గిరిజాధి
  9. క. రెట్టంబు
  10. క. గిట్టంబు