|
శరమునఁ బొడమిన చక్కని సారథి
సారథి [1]చేగొన సాగు హరులు
హరుల సామర్థ్యంబు లరసిన శింజిని
శింజినిఁ దరిత్రాడు సేయు బలము
|
|
తే. |
పొందువడఁజేసి దైత్యుల పురములేసి
యఖిలజగములు రక్షించు నట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!
| 43
|
సీ. |
దేహంబు మిక్కిలి తిరమైన రథముగా
ఘననేత్రయుగము చక్రములు గాఁగ
నూర్పు లశ్వంబులై యొప్పారుచుండంగ
దొరయు పళ్ళెరము సూతుండు గాఁగ
నవ్యాంగమతి శూరసాయకంబది గాఁగ
సొరిదిఁ గుంతలములు జోడు గాఁగఁ
దలమైన విహరణస్థలము కార్ముకముగా
నలువైన హారంబు నారి గాఁగఁ
|
|
తే. |
నన్నియును నీ మహత్త్వంబె యగుటఁజేసి
లీలఁ ద్రిపురంబు లేసి గెల్చితివి గాక
నీకు నొరులు [2]సహాయులై నిలువఁగలరె
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!
| 44
|
కవిలోకబ్రహ్మ - పెదపాటి సోమరాజు - శివజ్ఞానదీపిక
సీ. |
కవగూడి నడక సాఁగని బండి[3]కండ్లును
దొమ్మిది తునుకల తొడుసు తేరు
పెక్కు బ్రాహ్మణుల చేఁజిక్కిన [4]గుఱ్ఱాలు
చిలుకుల నఱిగిన చివుకు టిరుసు
బహుముఖవిభ్రాంతిఁ బడలిన సారథి
వినువీథి [5]నుఱిమిన [6]విరుగు విల్లు
పదిబ్రద్దలై [7]యొడ్డు వాసిన బాణంబు
పొరలెత్తి పోయిన బోలు నారి
|
|
తే. |
పట్టఁ బసలేదు సాధనప్రకరశక్తి
విషమ[8]లక్ష్యంబు లైనట్టి విమతపురము
లెల్ల సాధించి గెల్చితి వేక[9]హేతి
బాపు! త్రిపురాంతకేశ్వర! భక్తవరద!
| 45
|
- ↑ క. భోగాన, ట. మొగమున
- ↑ క. సహాయమై
- ↑ ట. కండులు
- ↑ ట. గుఱ్ఱమ్ము
- ↑ ట. నఱమిన
- ↑ ట. వీఁగు
- ↑ క. యొద్దు
- ↑ ట. శబ్దంబు
- ↑ క. హేలి, ట. హేల?