Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీవు నిదియు నెఱిఁగి కావింపు సప్తాంగ
సంగ్రహంబు నీతిశాస్త్రనిపుణ!

7

[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [2-6]

తే.

ధన్యతయుఁ బూర్ణతయుఁ గొల్పు దానమునకుఁ
బ్రోదియును రక్షయును జేయు భేదమునకు
దండియును వన్నెయును దెచ్చు దండమునకు
సామమున కే యుపాయంబు సమము గాదు.

8

[2-7]

క.

హితు లగుదు రహితవర్గము
హితవర్గము ప్రాణమైన నీఁ జూచు హితా
హి[2]తతతిగతరూపజగ
త్త్రితయసువశ్యౌ[ష]ధములు ప్రియభాషణముల్.

9

[2-8]

క.

కాకేమి తన్నుఁ దిట్టెనె
కోకిల దన కేమి ధనము కోకొమ్మనెనే
లోకము పగ యగుఁ బరుసని
వాకునఁ జుట్టమగు మధురవాక్యమువలనన్.

10

[2-10]

క.

శత్రుల మిత్రులఁ జేయున్
మిత్రుల భృత్యులుగఁ జేయు [నిజగుణవృత్తిం
బాత్రులుగఁ జేయు] నందఱ
ధాత్రీపతి కన్నియెడల దానము దగదే.

11

[2-14]

క.

పౌరుషము గలుగఁగానే
సారములగు భేదదానసామములు సమి
ద్భీరువున కవి ఫలింపఁగ
నేరవు షండాభిరూపనేపథ్యంబుల్.

12

[2-17]

క.

ప్రోదికొనఁదగిన పుష్పఫ
లాదులు గొడ్డంట వ్రచ్చి యవనిజమునెడన్

  1. సుంకెసాల
  2. క.హితులు