మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత్ర [3-104]
సీ. |
విరహపన్నగఫణావిహరణంబున వేఁడి
యూర్పులఁ బయ్యెద యొయ్యఁ గదల
ననురాగజలధిసంజనితఫేనచ్ఛాయ
లని [1]మేని వెలిచాయ లతిశయిల్ల
గాఢచింతాలతాకళికాకదంబకం
బన ఘర్మకణజాల మంకురింప
నురు మోహతిమిరఖద్యోతంబులనఁ గాకఁ
[2]బెట్టు కుంకుమచర్చ [3]పేటు లెగయఁ
|
|
తే. |
గుటిలకుంతల యున్న యిప్పటితెఱంగు
ప్రాణప్రదమైన మనకుఁ జెప్పంగ నేల
చాల నట్టింటి పగయైన శంబరారి
యట్టివానికి మది దయ పుట్ట[4]కున్నె.
| 87
|
పురుషవిరహము
[5]సంకుసాల సింగన - కవికర్ణరసాయనము[3-42]
సీ. |
భద్రేభకుంభసంస్ఫాలనక్రీడలఁ
దన్వంగి కుచములుఁ దలఁచి తలఁచి
కరకృపాణికసముత్కంపనక్రీడలఁ
దరళాక్షి కన్నులుఁ దలఁచి తలఁచి
ధరవైరిమణిహారధారణక్రీడలఁ
దరుణి కుంతలములుఁ దలఁచి తలఁచి
సజ్జ్యకార్ముకలతాసంగ్రహక్రీడల
లలన [6]బొమ్మల తీరుఁ దలఁచి తలఁచి
|
|
తే. |
రుచిరతరభద్రపీఠాధిరోహణములఁ
దామరసనేత్ర కటి పెంపుఁ దలఁచి తలఁచి
యవనిపతి [7]స్వపదర్థానుభవము లెల్లఁ
గన్యరూపానుభవముగాఁ గరఁగుచుండె.
| 88
|
సీ. |
గజయాన మెలఁగిన గతియైనఁ బైఁబడ
గద్దించి తర్కించి కలక నొందు
మానిని యల్గిన మాడ్కి ద్రోఁచినఁ దేర్ప
|
|
- ↑ క.జాలి పెల్లబాటు
- ↑ క.చెల్లి
- ↑ క.చేటు
- ↑ క.కుట్టె
- ↑ సుంకసాల
- ↑ క.మోముల
- ↑ క.నిజ