Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మొగి గుణస్థితి నిద్ర యుడిగి పొగడ
విరహతాపంబున వేగియుండుట కార్మ్య
              మరుచి యేమిటిమీఁద నాస లేమి
యెన్ని యాడెడువారి నెఱుఁగమి నిర్లజ్జ
              గమనంబుఁ దనయిల్లు గడచి చనుట


తే.

వలపు దలకెక్కి యటు తనవశము గాక
పరవశత్వంబు చే టెల్లఁ బడుట మూర్ఛ
పొందలేకున్న ప్రాణంబు వోవుననుట
మృతిగఁ జెప్పుదు రివి దశగతుల చొప్పు.

75

పెద్దిరాజు – అలంకారము [2-61]

సీ.

ఆదియుఁ జక్షుఃప్రీతి యన నంత చిత్తసం
              గంబు నా మఱియు సంకల్ప మనఁగ
నటఁ బ్రలాపం బన నౌల జాగర మన
              నటమీఁద గార్శ్యసమాఖ్య మనఁగ
వెండియు విషమద్వేషం బనం ద్రపా
              సంత్యక్తి నాఁగ సంజ్వర మనంగ
నున్మాద మనఁగను మూర్ఛాపగమం బన
              మరణంబు నా నిట్లు మానినులకు


తే.

ననుగతద్వాదశావస్థయై తనర్చుఁ
బదియు దశ లండ్రు కొందఱు ప్రౌఢమతులు
పరఁగు లక్షణములు నుదాహరణములును
వరుసఁ జెప్పుదుఁ దెలియంగవలయు [1]నిందు.

76

స్త్రీవిరహము

పెద్దిరాజు – అలంకారము [3-123]

క.

అచ్చపువెన్నెలచేఁ గడు
వెచ్చుటలును [2]మాన మెడలి వెడవిల్తునిచే
నొచ్చుటలును బ్రియుం [3]డబ్బని
ముచ్చటలును విప్రలంభమునఁ జెప్పఁదగున్.

77


ఉ.

ఎల్లిద మయ్యెఁ దాల్మి తగవెల్ల వివేకము వింత యయ్యె మి
న్నెల్లను జంద్రుఁ డయ్యె వనమెల్ల మనోభవుతూపు లయ్యె మే

  1. క.నండ్రు
  2. క.వేగులును +
  3. క.అబ్బిన