|
యువమనోమృగరాజిఁ దవిలింపఁదీర్చిన
మదనవాగుర లిందువదన కురులు
|
|
తే. |
బాల్యతారుణ్యసీమావిభాగమునకు
నజుఁడు వ్రాసిన రేఖ తన్వంగి యారు
భానువరమునఁ బడసిన పంకజముల
యపరజన్మంబు పూఁబోణి యడుగు లధిప!
| 56
|
పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
సీ. |
అమృతంబు(లోని కం)దంతయుఁ బోఁదోమి
కొని పూర్ణచంద్రుండు దలరెనేని
విధుమండలంబున విధిచేత దళవంబు (?)
గని పూవుఁదూపులు [1]గ్రాలెనేని
శృంగారరససరసీజాతులైన కో
మలమృణాళంబులు [2]పొలసె నేని
పసిఁడికుంభములకుఁ బ్రభవించి మించు జ
క్కవకవ [3]బొదలంగఁ గలిగెనేని
|
|
తే. |
మెలఁత నీమోము చెన్నువ [4]మించవచ్చు
పొలఁతి చూడ్కుల పొలపంబుఁ [5]బోలవచ్చు
నింతి మృదుబాహువుల దొరయింపవచ్చుఁ
జెలువ చనుఁగవ జిగి సరి సేయవచ్చు.
| 57
|
సీ. |
అలరెడు రెప్ప లల్లార్చిన యందాఁక
యనిమిషకన్య గాదనఁగ వశమె
అమృతంబు చిలుక మాటాడిన యందాఁక
కనకంపుఁబ్రతిమ గాదనఁగ వశమె
నడుగక యడు గెత్తి నడిచిన యందాఁక
గొనబుఁబూదీఁగె గాదనఁగ వశమె
కలికి తనూరేఖ కదిసి కన్గొనుదాఁక
ఘనవనలక్ష్మి గాదనఁగ వశమె
|
|
తే. |
యువిద సఖిమీఁద వెడ వ్రాలియున్నదాఁక
నెనరు తొలుకారు మెఱుపు గాదనఁగ వశమె
వెలఁది గుణములు సఖులచే వినినదాఁక
నంగసంభవు మాయ గాదనఁగ వశమె.
| 58
|
- ↑ క.వ్రాలె
- ↑ చ.పొలిచె
- ↑ చ.బోడలు
- ↑ చ.మించు
- ↑ క.పోల్చ