పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గని వేడ్క నవ్వుచుఁ గౌఁగిలింపుచు నీడు
                   లేని యానందము బూని యొసఁగి
నట్టి నీవంటి దయాశాలి కేరీతి
                   నెనయైన బ్రత్యుపకృతిని యేమి


తే.

సేయనేరను, యిటుగానఁ జెడుగులైన
యన్యకాంతల నుద్వాహ మట్టె సేసు
కొనక నిట్టుల వటుతత్వ మెనసి యుండు
మదియె ప్రత్యుపకృతి యని యెంచు పుత్ర!


ఆ.

నాదు భాగ్య మిట్లు నను రమించెడువాన్కిఁ
గాక నేరికైనఁ గలుగ దెందుఁ
గాన నన్నుమిన్ననైన నన్నెప్పుడు
నెనసి సుతను దనిసి మనుము పుత్ర!


క.

 అను జననిపలుకు విని కొడు
కనుమతమును బొంది, పెండి లటుదెగి వటుఁడై
జననీమనోహరుండై
మనె, నమృతము ద్రావ పాలు మఱి రుచి యగునే?


క.

 అని జన్నిగట్టు కతఁ దెలి
పినఁ గాంచనమాలి నలరి వినియింకఁ జిరం
తనవృత్తాంతం బొక్కటి
వినవలతున్ గరుణఁజెప్పవే విప్రవరా!


క.

 శివుఁడా మోహినియగు వి
ష్ణువుతో రతిసల్పి యొక్క సుతు భైరవు నిం
పువరలఁగని సౌఖ్యంబునఁ
దెవిరెనఁట గణింప దీని దెల్పుము విప్రా!


వ.

అని యడిగిన కాంచనమాలిని కఖిలమహిమాక్షివప్రుం డగు యవ్విప్రుం డిట్లనియె.

[గ్రంథ మింతవరకు మాత్రము సముపలబ్ధమైనది.]