పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

గండొప్పన్ జననీవచోవిభవ మక్కాంతుండు యాలించి మై
నిండారన్ ఘనమోహవల్లి యెదుగ న్నేర్పేరంపడంగా కన
చ్ఛుండాపాశము జక్కఁదిద్ది గుదెగా చోద్యంబుగాఁ జేసి వే
దండాస్యుం డటు తల్లి యల్లకడవాత ల్పోరగా దీసినన్.


వ.

అయ్యెడ.


మ.

సరసంబౌ రతిసల్ప నెంతయు మదిన్ శర్వాణి వాంఛించి త
త్సురతానందము యబ్బిన ట్లలరి యౌత్సుక్యంబుతో వర్తుల
స్ఫురితాద్రిప్రతియౌ నితంబము మఱిన్ జొప్పేర్పడ న్విచ్చి త
త్కరివక్త్రోన్నత తుండకాండమును తద్వర్త్మన్ జనంగా నిడెన్.


క.

 అని యివ్విధమున దా నుడి
విన కథ విని సిగ్గుగఱచి వెఱగందిన కాం
చనమాలిని భావము గనుఁ
గొని యప్పాఱుండు బలికెఁ గుతుకితమతియై.


సీ.

ఇలగల్గు పడుచుల కెల్ల ప్రేముడు లిట్లు
                   గరఁగను నిదియె యబ్బురముగాదు
నిబ్బరంబుగనుండు నిండారుమరులతో
                   గాసి వెన్నాడి నిక్కముగ నుండుఁ
గాని యెన్నఁడు హాయి గల్గదు మూఁడవ
                   యుగమందు ద్రోవది సొగసఱైన
పట్టిఁ దండ్రినిఁ దోడబుట్టువుఁ జూచిన
                   చెలులకు యొడికట్టు చెమ్మగిల్లు


తే.

ననుచుఁ గఱివేల్పుతోనంట వినఁగలేదొ
గాననిటువలె కొండరా కూన బడిన
వెతలపై నవ్వఁబోక నీవెఱఁగు మాని
యవలి కత విను కొనదాక ననుచుఁ బలికె.


వ.

అయ్యవసరంబున.