పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మారి—భావా! యనుగ్రహింపఁబడితిమి.
క.

చిఱునాట నతిముదంబున
విరచించిన ప్రహసనమును వెలిఁ బుచ్చక యే
చిరకాలముంచి తిఁకఁ జూ
పరు లలరఁగ నాడుటెంతొ బావా! మేలౌ!

సూత్ర—బాగుగాఁ జెప్పితివి కాని నాకొక పెద్ద యవరోధమున్నదోయి! చిన్నప్పటినుండియు నేను నాట్యమునం దసమర్ధుఁడనే,వట్టలు క్రిందికి జాఱి దబ్బకాయగుత్తులవలె వ్రేలాడుచు నీతలయంత లావుగ నుండుటచే యీడ్చుకొని తిరుగుటకే కష్టమగుచుండ నాట్యము కూడజేయగలనా? అయినను విచారము లేదు నీసహాయమున నెట్లో సభ్యలమనముల నాకర్షింపగలను.
మారి—(నవ్వి) ఇక నేమి కావలయును? బాగుగానే యున్నది కాదా? నాతో నీకు బనియే లేదు.
తే.

కట్టుకొన్నట్టి ధోవతి కదులునటుల
తొడల రెండింటి నటునిటు తడతడ మని
తాకి వ్రేలాడు నీబుడ్డ తాండవించు
ని న్ననుసరించి నాట్యము నెరపుగాదె?

సూత్ర —ఇదియును యుక్తియుక్తముగనే యున్నది. అటులైన వేషములు వేసికొనుటకు ద్వరపడవలయును. ఇప్పుడు
తే.

అధరదళమాన గమకించునట్టి ద్విజుని
యరసికతఁ గాంచి గంధవాహమున వివశ
యగుచు సహకారవల్లిక యలరు తనదు
సుమము నోటికందించుఁబుంస్కోకిలకును.

మారి—బావా! వసంతఋతువు ప్రవేశించినట్లు బాగుగా గుర్తించితివి. ఎట్లన?
తే.

మ్రోలవికసించు సంపంగిమొగ్గయందు
ప్రతిఫలించిన కెంకేళిపల్లవంబు
స్వేచ్ఛగాఁ బూకు నాకెడు విటుని నాసి
కాగ్రలగ్నార్తవము వలె నలరుచుండె.

సూత్ర—అందుచేత నిప్పుడన్నియును సమకూడినవి.
సీ.

అలరుశృంగారంబు నద్భుతరసమును