పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

.

లంబోదర ప్రహసనము

నాంది

చ.

పదపడివచ్చు షణ్ముఖుని వాహమయూరము పామటంచు పె
న్ముదమున దానిడాసి తనముక్కునఁ బోటిడ వ్రేలుగోచియం
దొదగశఁ బైకి నెక్కెడు మహోదరుఁడౌ గణనాథుమొడ్డ సం
పదల నొసఁగి మిమ్ముల శుభస్థితి నెప్పుడు ప్రోఁచుఁగావుతన్.


మ.

దినమున్ రేలును లేచి వింధ్యగిరిగా దీపించి యబ్జార్క మా
ర్గనిరోధం బొనరించి కుంభజుని మ్రొక్కఁజేయు నాకుంభక
ర్ణుని లావౌ నిడి మొడ్డ భవ్యమగుకాన్పుల్ మీకు నీనుండ నెం
దున్నకైన సర్వనిలింపులంగొలుచు వృత్తుల్ మీకు నభ్యోత్తముల్.

సూత్ర—(ప్రవేశించి) సభికులను సాదారముగా జూచి దోసిలొగ్గి.
ఉ.

జానువు లూరువుల్ బిగియఁజాలగ వాతముచేత భూమిపై
నూని కరంబులన్ ముసలి దోర్తుక మూత్రము జార్చుచుండ న
చ్చో నొకగార్దభం బరచుచున్ తనశిశ్నము లేపి యెక్క నా
బానిస బోర్లఁగాఁ బడ నపారముదం బిడు మీకు సౌఖ్యముల్.

[పుష్పాంజలిం జల్లి తెరవంక జూచి మారిషా! ఇటురమ్ము.]

మారి—(ప్రవేశించి) బావా! వచ్చితిని.
సూత్ర —బాగు! చుల్ల పెట్టినతోడనే పచ్చసెగ తగులుకొన్నట్లు మాటలోనే వచ్చితివే! కాని యార్యమిత్రుల యాజ్ఞ వింటివా?
మా— ఏమని?
సూత్ర— "ఓయీ! భరతపుత్రుడా! యెన్నడును జూచియెఱుంగని హాస్యరసబంధు