పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొడిమ

ఈ ప్రహసనమును మహాకవి కాళిదాసుచే రచియింఁపబడెనని కొందరును యవాచ్యము లుండెను గాన నింకెవరో రచియించి కాళిదాసవిరచితమని వ్రాసియుండి రని కొందఱు నీమధ్య వాదప్రతివాదనలు మిక్కుటముగా జరిపిరి. తుదకు పర్యవసాన మేమియుఁ దేలినదికాదు. భోజరాజు కంఠములో నొకవ్రణము పుట్టెనని, యెక్కువగా నవ్వినగాని యావ్రణము పరిపక్వమునకు రా దని వైద్యులు సలహా నీయుటవలన కాళిదా సీప్రహసనమును రచించి, వినిపింప భోజరాజు మిక్కిలిగా నవ్వుటచే నాతని కంఠమునం గల వ్రణము పరిపక్వమునకు వచ్చె నని, యనాదినుండియు ననుకొనెడి జనశ్రుతిని బట్టియు, డిండిమప్రహసనముకూడ నిట్లే యవాచ్యములతో నుండుటవలనను బ్రతాపరుద్రీయము మొదలుగాఁగల నాటకముల యందు హాస్యరసపోషణమునం దవాచ్యములే యుండుటవలనను పూర్వకవులు హాస్యరసమున నవాచ్యములే వాడి యండుటవలనను నీప్రహసనము మహాకవి కాళిదాసవిచిరత మని మా యభిప్రాయము.

మావలన “హాస్యకళానిధి”యని బిరుదము నందిన నాధునికకవివరుం డొక్కరుఁ డీప్రహసనమును నాంధ్రమున ననువదించి లంబోదరప్రహసనమని నామకరణ మొనర్చి మాకుఁ బంపి తననామమును ముద్రింప వలదని కోరుటవలన "హాస్యకళానిధి” యని మాత్రము ప్రకటించితిమి. సంస్కృతమునన గాళిదాస ప్రహసన మొకవైపునను ననుసరించిన లంబోదర ప్రహసన మొకవైపునను ముద్రించి తమసన్నిధికిఁ బంపితిమి. కావున 1, 2, గ్రంథముల మాదిరిగా నాదరింతు రని దలచుఁ చున్నారము.

ఇట్లు

పుదుచ్చేరి,

యస్. చిన్నయ,

15-8-22

సంపాదకుఁడు.