పుట:పల్నాటి చరిత్ర.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

పల్నాటి చరిత్ర

వ్యాధి పూర్తిగ కుదిరెను. పిమ్మట నేకారణముననో మనస్సు చలించి మొదటివలె విషయలోలుడుకాగా చెన్న కేశవుడు కోపించెను. ప్రతిదినము పగలే ప్రత్యక్షమగు నా దేవుడా రోజ తనికి దర్శనమీయక కలలోకన్పించి నీవుపతితుడవైతిని కావున నీ గ్రంధమును గైకొనజాలను. అది మాదిగలపాలౌగాక యని శిపించెను” ఈకధ యెట్లన్నను శ్రీనాధును రచించిన మంజరీ ద్విపద పిచ్చుకుంటలు మాలలు మొదలగువారి యధీవముననే యుండినది, దానిలో యుద్ధభాగమును అక్కిరాజు ఉమాకాంతముగారు ముద్రింపించిరి .

2. కొండయ్య:- శ్రీనాధునిపిమ్మట నితడు ద్విపదకావ్యముగ పల్నాటి వీర చరిత్రను వ్రాసెను. అది అముద్రితము. చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయములో కలదు.

3. మల్లన:- ఇతడుకూడ ద్విపద కావ్యముగ పల్నాటి వీర చరిత్రమును వ్రాసెను. ఇదికూడ ముద్రింపబడ లేదు. ఇది కూడ చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయములోనే కలదు.

4. ముదిగొండ వీరభద్రకవి:- వీరభాగవతమను పేర కల్నటి వీనికధను పద్యకావ్యముగా క్రీశ 1862 ప్రాంతమున రచించెను. ఇతడు సత్తెనపల్లితాలూకా నందిగామ నివాసి

5. ఏటుకూరి వరసయ్యగారు:- క్షేత్రలక్ష్మి మొదలగు గ్రంధములు రచించెను. గురిజాల హైస్కూలులో కొంత శాలము ఆంధ్రోపాధ్యాయులుగ నుండెను. మగువమాంచాల యను పద్యకావ్యమును రచించెను.