పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

పద్మపురాణము


తే.

విష్ణుతత్పరయై [1]సంగవిగతబుద్ధి
నింద్రియంబుల [2]నెల్ల జయించి భక్తి
దేవపితృతర్పణము చేసి తివిరివేల్చి
యతిథిభుక్తాన్నశేషంబు లనుభవించు.

182


వ.

ఇవ్విధంబునం గృచ్ఛ్రపరాకాదివ్రతంబులు పునఃపునరారంభం
బున మాఘంబులఁ జరియించుచుఁ దపస్వినియును వల్కలినియు
మహాసత్త్వగుణసంపన్నయు నగు వృక్షకాంగనకు రేవాకపిలా
నదీసంగమంబున నఱువదిమాఘంబులు సంభవించె నప్పు
డుపవాసాదినియమవ్రతంబుల నశియించిన శరీరంబు విడిచి
మాఘస్నానపుణ్యఫలంబునం జేసి విష్ణులోకంబునం జతుర్యుగ
సహస్రంబు లనవరతసుఖంబు లనుభవించు చుండెనని దత్తా
త్రేయుండు గార్తవీర్యునకుం జెప్పిన విని యట మీఁదికథ యె
ట్లయ్యెనని యడుగుటయును.

183


ఉ.

తార మరాళ హీర హిమధామ తుషార మృణాళ ఫేన క
ర్పూర సితాబ్జ శంఖ సుర భూరుహ కాశ పటీర నారద
క్షీర మృగేంద్ర హార హర శేష సుధాకరతుల్య సర్వ ది
క్పూరిత కీర్తిజాల! గుణభూషణ! సంతతశిష్టపోషణా!

184


క.

వెలిగందల నరహరి పద
జలరుహమకరందమత్తషట్చరణగుణో
జ్జ్వలనవ్యమకరకేతన
విలసితనవకావ్యగీతవిద్యానిలయా!

185


మాలిని.

అనుపమశుభమూర్తీ! హారిదిక్పూర్ణకీర్తీ!
వినయగుణవిశాలా! విష్ణుసేవైకశీలా!
వనరుహదళనేత్రా! వాణసాంభోజమిత్రా!
కనకశిఖరిధైర్యా! కందనామాత్యవర్యా!

  1. సంగవిగత బుద్ధి (తి)
  2. నైదింటి నెలమి గెల్చి (హై)