పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

15


తే.

బాదరాయణవాక్సుధాప్రౌఢిఁ బెరిగి
నిఖిలధర్మంబులకు నిల్వనీడ యగుచు
విష్ణురూపంబు దానయై వెలసి సౌమ్య
రసికమై యొప్పుఁ బద్మపురాణతరువు.

68


వ.

కలికాలజనితమహాదోషాతపసంతప్తాంతరంగులును సంసార
పథశ్రాంతస్వాంతులును నగు మనుష్యు లిప్పుణ్యతరుశీతల
చ్ఛాయ నాశ్రయించి కృతతత్ఫలరసాస్వాదనసుఖానుభవులై
తాపత్రయంబులం బాసి జరామరణభయబుభుక్షార్తిరహితులై
యవ్యయానందంబు నొందుదురు; అట్లు గావున నిప్పుణ్యపురా
ణంబు తెనుంగుబాస నా నేర్చిన చందంబునం గద్యపద్యంబుల
రచియించుట యిదియును [1]నప్పురాణపురుషునకు నొక్క
పూజావిశేషంబు గావుతమని యిచ్చంగోరి సకలవిద్వజ్జనానుగ్ర
హంబు వడసి యుపక్రమించి.

69

షష్ఠ్యంతములు

క.

శ్రీలలనావిలసదపాం
గాలోకనవిభవసంతతాభ్యుదయునకున్
వ్యాళాధిప[2]సమధికవా
గ్జాలునకును రాజనీతిచాణుక్యునకున్.

70


క.

తరుణీజనమన్మథునకు
గురుతరరిపురాయగండగోపాలునకున్
ఖరకరనిభతేజునకును
సురగిరిధైర్యునకు మంత్రి చూడామణికిన్.

71
  1. నప్పుణ్యపురుషునకు (ము)
  2. సన్నిభవా (హై)