పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19


క.

వెన్నెల నీనెడి నవ్వును
గన్నులచెలువంబుఁ జన్నుగవయొప్పిదమున్
నెన్నడుము బడువుఁదనమును
పున్నమనెలఁ దెగడు మోముపొలుపును మెఱయన్.

I-160


సీ.

ఘననీలమణికాంతిఁ గనుపట్టు కొప్పుపై
       మందారపుష్పదామములు వెలుఁగ
నిభకుంభయుగమున కెనవచ్చు జనుదోయిఁ
       బూననేరక లేఁతకౌను నులియఁ
బద్మరాగారుణపదపల్లవంబుల
       రత్ననూపురమంజురసము లులియఁ
గందర్పునందంబు గతిఁ బొల్పు మోమున
       మహితచందనలలామము దనర్పఁ


గీ.

గమ్మతావులు కటిపంక్తిఁ గడలుకొనఁగ
శంబరాంతకు మోహనశక్తివోలె
నలరు నూర్వశి నా నొక్కయమరకాంత
తివుట నేతెంచె నప్పురూరవుని కడకు.

I-161

పోతే సింగనది ఏమాత్రం కాఠిన్యంలేని సరళసుందరపురాణశైలి.

కాకతీయభానుడు అస్తమించిన తరువాత చీకటిముష్కరులు చేసిన దురాగతాలు ఇంతంత కాదు. దాదాపు పాతికసంవత్సరాలు యావద్దక్షిణాపథం రక్తసిక్తమై పోయింది. కాకతీయుల ఆడపడుచు విశ్వనాథుని శిష్యురాలు రెండవ కంపరాయల భార్య గంగాదేవి తన మధురావిజయకావ్యంలో ఆనాటిఘోరాలను ఈవిధంగా చిత్రించింది.

సతతాధ్వర ధూమసౌరభైః ప్రాఙ్నిగమోద్ఘోషణవద్భి రగ్రహారైః
అధునాజని విస్రమాంసగంధై రధికక్షిబ తులుష్క సింహనాదైః

VIII-7


మధురోపవనం నిరీక్ష్య దూయే బహుశః ఖండిత నారికేళషండమ్,
వరితో నృకరోటికోటిహార ప్రచలచ్భూల పరంపరా పరీతమ్.

VIII-8