పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీగురవేనమః శుభమస్తు - అవిఘ్నమస్తు

పండితారాధ్యచరిత్ర

శ్రీ గురుమూర్తి నూర్జిత పుణ్యమూర్తి
నాగమాంతస్ఫూర్తి నానందవర్తి
వృషభస్వరూపు నవిద్యాదురాపు
విషమప్రతాపు నిర్విషయకలాపు
పరమకళ్యాణు సద్భక్తధురీణు
శరణాగణప్రాణు సజ్జనత్రాణు
ప్రమథైకవిశ్రాము భక్తలలాము
కమనియ్యగుణధాము గణసార్వభౌము
నీతజంగమదాస్యు నిగమమయాన్యు
భూతలైకనమస్యు బుధజనోపాస్యు
శివభక్తసింహంబు చిన్నివాసంబు
భవగిరికులిశంబు బసవలింగం
బు। తెల్లంబుగానస్మదియ్యేశుచెన్న
మల్లికార్జునదేవు మహితరూపంబు
దానయౌ బసవన దండనాయకుని
జానొంద మత్కృతిస్స్వామి గావించి
కమనియ్యసరళ నిష్కళతత్వమయుల
ప్రమథుల త్రిభువనప్రమథుల దలచి
నుతపురాతనభక్త నూతనభక్త
వితతిలింగంబకా వీక్షించి కొలిచి
యారూఢముగ మల్లికార్జునపండి
తారాధ్యులచరిత్ర మర్థివర్నింతు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
నిండారుశివధర్మనియతి వట్రిల్లు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
పండినసద్భక్తిభాగ్యంబు దొరకు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
చండోరగాదివిషంబులు గ్రాగు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
మండెడుదావాగ్ని మంచయి విరియు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
దండిభవాంబుధి తరతరమింక్కు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
ఖండితైశ్వర్యప్రకాశ మింపొందు
దుండగంబగు బహుదుఃఖంబు బాయు
భావింపనటుగాన పండితారాధ్య
దేవుని చరిత గీర్తింతు నెట్లనిన
చిరతమోగుణ పరిస్ఫీతుండు శివుడు
వరసత్వగుణ వికస్వరుడు పండితుడు
అరయ నచరలింగ మాలింగమూర్తి
అరుదైనచరలింగ మాపండితయ్య
అసమలోకాధీశు డంబికారమణు
డసమలోకారాధ్యు డాపం