పుట:నీతి రత్నాకరము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ వీచిక.

105

కూలముగా నుండుటంబట్టి కాబోలు కొంద ఱీయాచారమే మంచిదనుచున్నారనియు, దానినే యనుసరింపఁ బ్రయత్నించు చున్న వారనియు వినుచున్నాఁడను. ఈయాచారమే క్రమ క్రమముగ వృద్ధియైనచోఁ బ్రాచీనసదాచారము లడుగంటి స్వేచ్ఛాచారములు ప్రబలును. దాన సత్యము ధర్మము నశించును. అసత్యాధర్మములు పెంపొందును. వివాహధర్మము తుదముట్టం జెడును. సహధర్మ చారిణి యను పేరు భార్యకుంజెల్లదు. దాంపత్య సుఖము కూడఁ జెడఁగలదు. పరపురుష సంగతిన్ మెలంగుట యుత్తమ స్త్రీ ధర్మంబు గాదను సృతి పురాణేతిహాసములు వ్యర్థములగు. ఏనాఁ డాభావము మానవులమదుల వ్యాపించునో యానాఁడే కలిపురుషుఁడు తాండవ మాడునని నమ్మవలయును.

మహాజనులారా! [1]సత్కర్మముల నుమ్మాలించిన భగవంతుఁడు దూరమగును. కులకాంతలు దుష్టలగుదురు. దాన వర్ల సంకరము గలుగు, అయ్యది నరక ప్రాప్తి హేతువగును . పితరులు లుప్తపిండోదక క్రియు లగుదురు. విశేషించి స్త్రీలు

  1. ఆధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః, స్త్రీషు దుష్టాను వార్షేయ జాయతే వర్ణసంకరః, సంకరోనరకాయైన కులఘ్నానాం కులస్య చ, పతంతి పితరో "హ్యేషాం లుప్తపిండోదక క్రియాః, భగవద్గీత ౧ అధ్యా. యాదృశం భజతే హి స్త్రీ సుతం సూతే తథావిధం, తస్మాత్ప్ర జా విశుధ్యర్థం స్త్రియం రక్షేత్ప్రయత్నతః. స్వాం ప్రసూతిం చరిత్రం చ కులమాత్మాన మే వచ, స్వం చ ధర్మం ప్రయత్నేన జాయాం రక్షన్ హి రక్షతి. మనుస్మృతి ౯ అధ్యాయము.