పుట:నిజం కూద అబద్దమె.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోలియర్.

"మోలియర్" ఒక ఫ్రెంచికవి; నాటకకారుడు; నటుడు. అతని పుట్టుక 1622. మరణం 1673. హాస్యరసప్రపంచంలో అతనిది పెద్దపేరు. అతడు సుమారు ముఫ్ఫై ప్రదర్శనాలు వ్రాశాడు. అతని కథాసందర్భం అపూర్వం, చమత్కారం అఖండం; అనుభవం అపారం; భాషాజ్ఞానం అద్వితీయం; హేళన తీవ్రం. అప్పుడు తన దేశంలో ఉండే సంఘం యొక్క దురాచారాలున్నూ వ్యక్తుల యొక్క అవగుణాలున్నూ అతడు పరిహసించి వ్రాసినా, శాశ్వతత్వం ఇచ్చే లక్షణాలు కొన్ని అతని రచనలో ఉండడంవల్లే నేటివరకూ అతని ప్రదర్శనాలు అన్య దేశీయుల్ని కూడా ఆకర్షిస్తున్నాయి.

అనుసరణకర్త