పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవి చక్కని పదలాలిత్యంతో సార్థకమైన పదప్రయోగాలలో తన లోకానుభవానికి ప్రతీకలుగా ఈ క్రింది పద్యాలు రచించాడు.

"గావు పట్టెదఁ దొలంగక నిల్చెనేని బె
        బ్బులుల నెన్నిటినైనఁ బూని తెత్తు
బెలుఁగుఁ గూల్చెద నొక్కయలుగున నిపుడునా
        యెలుఁగునఁ గడకడ కేఁగకున్నఁ
దగరుతాఁకుల బోడతలలుగాఁ దాఁకింతుఁ
        గారుపోతులఁ గొమ్ముగములు విఱిచి
యొంటిగాఁ డెదురైన బంట పోకు మటంచు
        ఢాకమై విదిలింతు నీ కటారి
భీకరంబుగఁ దముఁ దామె పెట్టికొనిన
ఓరుచు లేటికిఁ జూడు నా పెంపు సొంపు
పట్ట నేటికి జముదాళిబాకు కిరుసు
మరియ విలునమ్ములున నేఁడు చూడు రాజ."


"పులి యెలుఁగు పంది దుప్పి కార్పోతు మన్ను
జింక యననెంత నేఁడు నాచంక నిఱికి
వేనవేలుగఁ దెత్తు నా వేఁట చూడు
సామిఁ బంటుతనంబును సాహసమును."


"నూటి కొక్కండు నామూఁక పోటు బంటు
సామి! పులుఁగైన వెలుఁగైన నేమి విడువు
కత్తియుఁ గటారి నేఁటికి కదిసి నపుడె
చంకఁ గొట్టి యడంతు నిశ్శంకవృత్తి."

(నార. 218, 219-పు. 144, 145, 146-ప.)

సూతుడు బ్రహ్మజ్ఞానతత్వం బోధించే సందర్భంగా నరసింహకవి ఒకానొక విశిష్టచమత్కృతిగల యీ పద్యాన్ని విరచించాడు.

"ఆత్మవేదులు కర్మ మర్హంబె సేయ
నంద్రు కొందఱుసూరు లయ్యాత్మవేదు
లైనవారికిఁ గర్మమర్హంబె సేయ
నంద్రు కొందఱుసూరు లత్యంతమహిమ."

(నార. 323. పు. 25. ప.)