పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తపము శ్రేష్ఠంబు సత్యంబునకంటెను
         తపమునకంటెను దమము యోగ్య
మా దమంబునకంటె నర్హంబు శమము శ
         మంబునకంటె దానంబు ముఖ్య
మా దానమునకంటె నధికంబు ధర్మమా
         ధర్మరహస్యకృత్యమునకంటెఁ
బ్రవ్రజనము మహాభవ్యంబు తత్ప్రవ్ర
         జనమునకంటె శస్తంబు వహ్ని
వహ్ని కంటెను యజ్ఞంబు వరతరంబు
మానసము యజ్ఞమునకంటె మహితతరము
ఘనము న్యాసంబు మానసగరిమకంటెఁ
దద్విశేషంబు లెంచంగఁ దరముగావు.

(నార. 171, 172. పు. 120, 121. ప.)

రుక్మాంగదుడు వేటకు వెళ్ళిన సందర్భంలో నరసింహకవి చేసిన వర్ణన పరమాద్భుతంగా నరసింహకవి శబ్దశక్తికి పదప్రయోగనైపుణ్యానికీ బహుముఖమైన లోకానుభవానికి ప్రతీకగా విరాజిల్లుతున్నది. రుక్మాంగదుడు "హరి కరిగిరి గండక కాసరగవయ తరక్షుఋక్ష శల్యకులంగోత్కర భీకర ఘోరవనాంతరములకు" ఉత్కంఠతో వేటకు వెళ్ళగా అనేకమంది చెంచుదొరలు నేల ఈనినట్లుగా రుక్మాంగదుని సమక్షంలో

పరిపక్వబహువిధఫలశిక్యములతోడ
         క్షౌద్రవీవధసహస్రములతోడఁ
బంచషసారంగబాలోత్కరముతోడఁ
         జంజరకీరడింభములతోడఁ
బరిరటత్సంకుశాబకవితానముతోడఁ
         గస్తూరికామృతగోత్కరముతోడఁ
బల్యంకికాదండబహుదండములతోడ
         భవ్యచామరకదంబములతోడ

(నార. 218-పు. 143-ప.)

మొక్కి వయారపు మొనలుదీర్చి ఒకానొకవిడ్డూరం వలె ఎంతో వింతగా విశిష్టంగా తమ తమ వేటల నేర్పరితనాన్ని ఉగ్గడిస్తూ విన్నవించారని నరసింహ