పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నీ మహత్వంబు విని విని నీరజాక్ష
భక్తినిష్టాపరత్వ మేర్పడఁగ గంటి

(నార. 189. పు. 105.ప)

బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతల గురించి తపస్సు చేసిగాని వారిని భక్తితో పూజించి గాని వివిధవరాలనూ ఐశ్వర్యాదులను పొందవచ్చునన్న విషయం సర్వవిదితం. కుబేరుడు మహైశ్వర్యవంతుడనీ ధనాగారాలకు మూలభూతుడని కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే విశిష్టంగా నరసింహకవి నలమహారాజువల్ల సంపదలు పొందవచ్చునని నారదీయపురాణవచనంగా ఈ క్రింది పద్యంలో ఉటంకించాడు.

అర్కునివలన నారోగ్య మాయె నలుని
వలన సిరియును శంకరువలన బోధ
మచ్యుతువలన ముక్తియు నందవలయు
ననఁగ నుపవిషదుక్తియుక్తార్థముగను.

(నార. 327-పు. 37. ప)

ఇది అత్యంతవిపులంగా వర్ణించబడిన వివిధనలచరిత్రలలో కూడా కానరానివిశిష్టవిషయం.

నరసింహకవి వైకుంఠలోక ఆవరణపంచకాలను వర్ణిస్తూ వైకుంఠలోకంతో పాటు దానికి చుట్టూ వివిధదిక్కులలో ఉన్న అనేకలోకాలను వర్ణించాడు. "విశేషంబున మరియు వైకుంఠలోకంబు వర్ణించెద వినుము. ప్రాగవాచిని శ్రీలోకంబును బశ్చిమంబున శ్రీవైకుంఠంబునకు దక్షిణంబున నిత్యానందంబునిధియు సద్భక్తవరదుండు నగు సంకర్షణవిభుండుండు. ఆ సంకర్షణలోకంబునకు పశ్చిమంబున నిర్మలానందనీరధి నిత్యంబు నగు సరస్వతిలోకంబులఁ దగు ప్రత్యగవాచిని సరస్వతిలోకంబున కుత్తరంబున బ్రద్యుమ్నలోకంబు చెలంగు. ప్రతీచీనయుతార్కేందుప్రభ దీపించి నిర్మలశర్మదంబై ప్రద్యుమ్నపదంబు దగ్గర రవిదిక్కున నిత్యాప్సరో౽లంకృతంబై రతిలోకంబు విరాజిల్లుఁ దత్ప్రాచీననిరుద్ధలోకంబు రాణించు నుదీచిం బ్రకాశించి యానందవారిధి యగు నా యనిరుద్ధలోకంబునకు బ్రాచి యగు విదిక్కున సద్గుణసాగరంబగు శాంతిలోకంబు విజృంభించు. ఇవి చతుర్వ్యూహంబులు నాలుగు శ్రీకళలు. నాలుగును బ్రదక్షిణక్రమంబునఁ బ్రాచ్యాద్యష్టదిక్కులం బ్రకాశించు నీ వ్యూహాష్టకంబు ప్రథమావరణంబున నుండు. 'మధ్యే మధ్యేత్వ సంఖ్యే యాస్తత్త ద్వ్యూహ'మ్మనిన శ్రుతివలన ననేకవ్యూహంబులు గలవు. ద్వితీయావరణంబునం బ్రాచ్యాదిదిక్కుల