పుట:ధనాభిరామము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

ధనాభిరామము

    గొనకొని పన్నమంచు వగఁగుంచమునం గొలువంగఁ జట్టురా
    తను మరినార వల్వను ముదంబున నేర్పరి యెన్నిచూడఁగన్. 64

[1]వ. ఇట్లు చనుదెంచి చేతోజాతచాతుర్యనూత్నలావణ్య
    మధురామృతపయోధివీచికాసముదయంబులం బ్రియంబులం
    దేలుచు సోలి పారవశ్యంబునం బొందియున్న సుగుణావతిం
    జూచి యిట్లనియె. 65

క. మనసున మీరున్నారా
   యని చూడవు నిట్టివారి నక్కట చెలులన్
   ఘనమతి మన్నింపవు కై
   కొన వీతని వలలఁ జిక్కి కువలయనేత్రీ! 66

మ. విను బాలామణి! యేమి చెప్పుదు జగద్విఖ్యాతిగా శిష్యు లే
   పున సేవింపగ సిద్ధుఁడొక్కరుఁడు సొంపుల్‌ మీఱ నీయూరికిన్
   చనుదెం చిప్పుడు రత్నభూషణతతుల్ చాలంగ వారాంగనా
   జనసంఘాతవిటాలి కిచ్చె మది నుత్సాహంబు సంధిల్లఁగన్. 67

క. మనవాడవనిత లందఱుఁ
   గనకాంబరమణిసుగంధఘనవస్తువులన్
   దనిసిరి మఱి నీవొక్కతె
   వును దక్క పురంబులోన నుత్పలనేత్రీ! 68

వ. ఏ నచ్చటికిఁ జూడంబోయిన మన్నించిన వస్తుసంచయంబు
   చూడు మివే యని ముందరం బెట్టి సిద్ధముఖ్యుండు మననిల

  1. ఇది ముద్రితప్రతిలో లేదు.