పుట:ధనాభిరామము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

59


    కలహంబె బ్రతుకుగాఁ గాలుదువ్వెడివిటుల్
             చేరి యాసలఁ బని సేయువిటులు
    వెళ్లి పోలేక మోములు వ్రేల్చు విటులు
    నింటి చుట్టునుఁ దిరుగాడు గొంటువిటులు
    [1]బాస లిచ్చినతెర ధూపార్తివిటులు (?)
    మొదలుగాఁగల విటులెల్ల ముద మెలర్ప. 33

వ. చనుదెంచి సద్వినయభయభక్తిపూర్వకముగా సాష్టాంగ
   దండప్రణామంబు లాచరించి నిలచినఁ జూచి సిద్ధముఖ్యుఁడు
   వారలతారతమ్యంబులకుఁ దగినవిత్తంబు లొసంగినఁ జేరి
   సేవచేయుచుండి రంత. 34

క. అనువుగ నతనిమహత్త్వము
   విని నానాజాతిఁ గల్గువేశ్యలు మోదం
   బున వచ్చి మ్రొక్కి నిల్చినఁ
   గనుఁగొని సిద్ధుండు వారిఁ గరుణాదృష్టిన్. 35

సీ. కమ్మలు పచ్చలకడియాలజోళ్లును
            పతకంబు మొలనూలు బాహుపురులు
   పుంజాలదండలు పూదెలకడియాలు
            ముంగరల్ రాకట్టునుంగరములు
   ముత్యాలపేరులు మొలనూళ్లు డోరీలు
            కుంటెనల్ నీలాలకంటసరులు
   ముంగామురంబులు మొగపులతీఁగెలు
           సందులదండలు సరపణులును

  1. వెఱచి నోరెత్తకుండెడి వింతవిటులు ము. ప్ర.