పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ద్విపద భారతము



కుండలాపహరణకథనము

గురుసేవ యేఁజేయ, గురుపత్ని నన్ను
నురుతర ప్రార్థన నొకనాఁడు చూచి :
పుష్యరాగపుఁగర్ణపూరయుగంబు
పౌష్యమహారాజుపత్ని యెప్పుడును
ధరియించునది నాకుఁ దనయ, తె"మ్మనిన
గురుపత్నితో నియ్యకొని, యేనుగదలి
పాతాళమున కేఁగి, పౌష్యునియింట
నాతిథ్యమొనరింప నతనిసన్నిధిని
గొనియుండి, మెప్పించి, కోమలిచేత
నొనరినతాటంకయుగ మందికొనుచు
వచ్చుచో, వెంటనేవచ్చి తక్షకుఁడు
మ్రుచ్చిలి తివిసె నేర్పున నటత్రోవఁ.
బాము లీవిధమునఁ బరువులుపెట్టి
యేమైనఁ జేసిన నెవ్వరుదిక్కు!
భూలోక[1] నాయకా, భోగుల నెల్లఁ
గాలునిఁగూర్పవె  ! క్రతుముఖంబునను,
ఈరీతి నీయాగ మీవు సేయంగఁ
గారణ మొక్కటి గల దదివినుము.

కద్రూవినతలు పుత్త్రులఁబడయుట

పరమతపోన్నతి బ్రాభవశక్తి
బరువడి కశ్యపబ్రహనాఁ బరఁగి,
ప్రకట సురాసుర ప్రముఖ జంతువుల
నకలంకతేజుఁడై యవనిఁ బుట్టించిఁ,

  1. బాయుగా, (మూ)