పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

508

ద్విపద భారతము.


జలము[1]నందును జరాసంధుండు పేర్చి
మలయుచు శూరుఁడై మధురపై విడియ
నేను సేనలుఁగూడి యెదిరిపోరాడఁ
బూనుచో, నెంతయు బుద్ధిజింతించి
యాహంసడిచికుల యాయుాధంబులును
వ్యూహంబులును జావకుండుటయెఱిఁగి
హతుఁడయ్యె హంసుఁ డుగ్రాజిలోననుచు
హితబుద్ధి డిచికున కెఱిఁగించి పనుప,
నతఁడు హంసునిమృతి యంతట దెలిసి
మతిలోనఁ గడుశోకమగ్నుడై యపుడు
పలికె: 'హంసుఁడు లేని బ్రదుకునా కేల!
యిలమీద' ననుచును నెంతయు వగచి
డిచికుండు గ్రక్కున దేహంబువిడిచె.
అచల ధైర్యుండగు హంసుండు డిచికు
మృతివార్తవిని వేగ మృతియునుబొందె.
మతి హంసడిచికుల మరణంబువినియు
నసహాయుఁడై మగధాధీశ్వరుండు
కొసరుచుఁబురికేఁగెఁ గోపంబునిగుడ.
ఏమును వారితో నెక్కటిపోర
నేమియుననలేక యెఱిఁగియు మధుర
విడిచి ద్వారావతి వేగనిర్మించి
కడిమి రైవతము దుర్గంబుగాఁజేసి
యందున్నవారము హర్షంబుతోడ
నిందుకు వెఱవక నిష్ఠురత్వమున
నవనిరాజులను బృహద్రథాత్మజుఁడు
తివిఱి పట్టుకవచ్చి దీర్ఘరౌద్రమున

  1. "అందు" ప్రత్యయమును తృతీయార్థములో నితఁడు చాల చోట్ల ప్రయోగించి
    నాఁడు