పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

ద్విపదభారతము


అని చెప్ప జనమేజయక్షమారమణుఁ
డొనరఁగ వ్యాసశిష్యునకుఁ గేల్మొగిచి :
"వనిత కామంత్రంబు వచ్చినతెఱఁగు
వినిపింపు." మని యడుగ వినిపించె నతఁడు :

కుంతి సౌరమంత్రోపాసన


"కుంతిభోజునియింటఁ గొండొకనాఁడు
కుంతి సన్మునులను గూర్చి, నిత్యంబు
హోన్నాణమున నెంతయొరసినఁ గూర
లన్నంబు పాయస మట్లు మాంసంబు
మొదలైన యిష్టాన్నములు వేడ్కఁబెట్టఁ,
బ్రిదులకు భోజనప్రియుఁడైన కతన
నొకనెల దుర్వాసుఁ డుండి భుజించి,
ప్రకటప్రియంబునఁ బల్కె నాసతికి :
“ఏను నీ కొకమంత్ర మిచ్చెదఁ గుంతి,
దానిసత్వమున బృందారకులైనఁ
దలఁచినఁ జనుదెంచి, తనయులై నీకు
నెలమిఁ బుట్టుదు." రని యిచ్చి పోవుటయు,
నామంత్రసామర్థ్య మరసెద' ననుచుఁ
గామిని యొకనాఁడు గంగకుఁ బోయి,
కర మర్థిఁ బొడుచుభాస్కరుఁ గోరి జపము
విరచింప, నతఁ డొకవిప్రుఁడై డిగ్గి
కదియుచో, లజ్జించి కరములు మొగిచి :
"యిది మంత్రసామర్థ్య మెఱుఁగలే నైతిఁ;
దప్ప నేటికి నేర్చుఁ దపసిమంత్రంబు!
ఎప్పటియట్లు నీ వేఁగవే దివికి!
కన్నియ నేఁ బుత్త్రుఁగనిన నవ్వుదురు;
మన్నించి పోఁగదే మార్తాండ!" యనుచు