పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

115


సిద్ధి బుద్ధి యనంగ సిద్ధకామినుల
యిద్ధాంశములఁ బుట్టి రిలఁ గుంతి మాద్రి ;
ధర్మాత్ముఁడైన యంతకునియంశమున
ధర్మరా జుదయించె ధరయెల్లఁబొగడ ;
నామహాత్ముని తమ్ముఁ డనిలునంశమున
భీమ సేనుఁడు పుట్టె భీమప్రతాపి ;
నరుఁడనుముని వచ్చి నా కేంద్రునంశ-
భరమునఁ గ్రీడియై ప్రభవించి మించె ;
[1]సహజు లశ్వినులయంశమ్మున నకుల
సహదేవు లొదవిరి జగతినిఁగ నలు;
శ్రీయంశమున యాజ్ఞ సేని జన్మించె ;
నాయెధృష్టద్యుమ్నుఁ డగ్నియంశమున ;
వివరింప భారతవీరులు మఱియు
దివిజాంశ దనుజాంశ దృష్టరూపముల
నవతరించిరి; యందు నమరాంశులెల్ల
రవి తేజుఁడైన ధర్మజుని వారైరి;
యసురాంశభవులెల్ల నాసుయోధనుని
వసమున నుండిరి వైరంబుదలఁచి.
అట్టిభారతవంశమనుసముద్రంబు
పుట్టెఁ జంద్రునినుండి బుధుఁడాదిగాఁగ.
జలరాశిఁ జంద్రుండు జనియించెఁగాక ;
జలధి చంద్రునియందు జనియించుటరుదు !
నుతికెక్క దుర్యోధనుఁడు బడబాగ్ని ;
యతిరథ సమరథు లందు జంతువులు;
సొరిదిఁ బుట్టిన రాజసుతులు రత్నములు ;
అరయ వారలకీర్తి యమృతరసంబు ;

  1. సహృదయు అశ్వినులంశమున. (మూ)