పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

ద్విపద భారతము.


అని పాణితలమున నతనిపెన్దొడలు
వనజాక్షి చఱచిన వైళంబ లేచి
“నీ వెవ్వ ? రనుటయు నెలఁత "నే" ననిన
భావంబులోన ద్రౌపది యౌట యఱిఁగి
"కీచకుం జంపింపఁ గినిసి యేతెంచె
నీచంద్రముఖి తానె యెఱిగించు గాక"
యని తా నెఱుంగనియట్లు వాయుజుఁడు
వనితఁ దప్పక చూచి వల నొప్పఁ బలికె:
"నడు రేయి నీరీతి నడయాడఁ దగునె?
పడఁతి యెవ్వరికంటఁ బడక వచ్చితివె?
ఏటికి చనుదెంచి తెఱఁగింపు ” మనిన
బోటి యొయ్యనఁ బల్కెఁ బురుషు నీక్షించి
"ముంజేతికంకణంబున కద్ద మేల?
కంజూక్ష నే నున్నగతిఁ గాన రాదె:
ఎఱిఁగియు. నెఱుఁగవే నెఱిఁగింప నేల?
మఱచిన విను నీకు మఱియుఁ జెప్పెదను.
జననాధుమఱఁది కీచకుఁ డప్పకడకు
వినతుఁ డై పో వచ్చి వెస నన్నుఁ జూచి
వలరాజువలఁ జిక్కి వరుస వాయెదుటఁ
బెలుచ దుర్నీతిమైఁ బ్రేలఁగా నేను