పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశువుల అక్రమ ప్రవేశ చట్టము, 1871

(1871 లొని 1వ చట్టము)

[18 జనవరి, 1871]

పశువుల అక్రమ ప్రవేశమునకు సంబంధించిన శాసనమును ఏకీకరించి సవరించుటకై న చట్టము.

ప్రస్తావన

పశువుల అక్రమ ప్రవేశమునకు సంబంధించిన శాసనమును ఏకీకరించి సవరించుట సముచిత మైనందున;

ఇందుమూలముగ ఈ [కింది విధముగా శాసనము ఛ్హేయబడినది :_

అధ్యాయము-1

ప్రారంఖిక

నామము మరియు విస్తరణ

1[1. (1) ఈ చట్టమును పళువుల అక్రమ ప్రవేశ చట్టము, 1871 అని పేర్కొనవచ్చును, ] మరియు

(2) ఇది, 2[ 1956 నవంబరు 1వ తేదీకి అవ్వవహిత పూర్వము భాగము-బి, రాజ్యములలో చేరియుండిన రాజ్య క్షేత్రములకును,] ప్రెసిడెన్న్సీ పట్టణములకును, మరియు రాజ్య (వభుత్వము ఆయా సమయములందు అధికారిక రాజపత్రములో అధిసూచనచ్వారా, దీని అమలునుండి మినహయించు స్థానిక ప్రాంతములకును తప్ప, యావచ్భారత దేశమునకు విస్త రించును.

3(3) x x x x

చట్టముల రద్దు-- రద్దు చేయబడిన చట్టములను గూర్చిన నిర్దేశములు.

2. రద్దు చేయు చట్టము, 1938 (1938 లోని 1వ చట్టము) ద్రారా రద్దు చేయబడినది,

అర్జా న్వయఖండము,

3. ఈ చట్టములో :—

“పోలీసు అధికారి” యందు గ్రామ కాపరికూడ చేరియుండును, మరియు “పశువుల”” యందు ఏనుగులు, ఒంటెలు, గేదెలు గుర్రములు, ఆడు గుర్రములు, విత్తులు కొట్టిన గుర్రములు, పొట్టిజాతి గుర్రములు, గుర్రపు పిల్లలు ....మగవి ఆడవి. -కంచర గాడిదలు, గాడిదలు, పందులు, పొట్టేళ్ళు, ఆడ గొర్రెలు, గొర్రెలు; గొర్రె పిల్లలు, మేకలు మరియు మేకపిల్లలు చేరియుండును 4[మరియు],

5[“స్థానిక ప్రాధికారి అనగా ఒక నిర్తిష్ట స్థానిక ప్రాంతములో ఏవేని విషయములను గూర్చి నియంత్రణమునకు, పరిపాలనకు శాసనము చ్యా రా ఆయాసమయములయందు అధికారము నిహితము చేయబడిన వ్యక్తుల నికాయము అని అర్ధము; మరియు

“స్థానిక నిధి"అనగా స్థానిక ప్రాధికారి నియంత్రణము లేక నిర్వహాణాదీనము నందున్న ఏదేని నిధి అని అర్థము],



1. మూల: పరిచ్చేదము. 1కి బదులుగ్యా. 1891లోని 1వ చట్టము ద్యారా పరిచ్భేదము 1 ఉంచబడినది.

2 "భాగము 'బి ' రాజ్యముల" కు బదులుగా శాసనముల అనుకూలానుసరణము (నెం, 2) ఉత్తరువు, 1956 ద్వారా ఉంచబడినది.

౩ ప్రతిస్టితము చేయబడిన ఉపపరిచ్చేదము (3), 1914 లొని 10వ చట్టము, పరిచ్చేదము 3, అనుసూచి-II చే రద్దు చేయబడినది.

4. 1819ళోని 1వ చట్టము, పరిచ్చేదము. 2 ద్వారా చొప్పించబడినది.

5 1887 జనవరి 14వ తేదీ తర్వాత చేయబడిన చట్టము లన్నింటికి. వర్తించునట్టి సాధారణ ఖండముల చట్టము, 1897 (1897లొని 10వ చట్టము) పరిచ్చేదము 3 ఖండము (28)లొని నిర్వచనము చూడుము.