పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దురితాచారుఁడు కోరు కోరికల నెంతో శీఘ్రతం దీర్చిఁ ద
త్కరుణ న్నిర్జరు లార్తిఁ చెందునటులన్ దాఁ జేసెనో [1]యీశితా.

66


వ.

కాన.

67


చ.

ధరణి గుణాఢ్యుడౌ దశరథక్షితినాధునకున్ దనూజుఁడై
హరిహయకంటకుండగు దశాస్యునిఁ ద్రుంచకయున్న నింక నే
కరణిని నుందు రీసురులు గ్రక్కునఁ జచ్చెదరంచు నన్న, నా
సరసిజలోచనుండు సురసంతతిఁ గన్గొని యిట్లనెన్ దయన్.

68


శా.

ఆశానాయకులార చింతఁగననేలా యిట్టు లాలించుఁడీ
నే శీఘ్రాన ధరిత్రిలోఁ గలిఁగి యానీచున్ దళాస్యాఖ్య దై
త్యేశున్ సంగరధాత్రిఁ గూల్చెదను, నాకేశాదులన్ గాఁచెదన్
ఆశల్ దీర్చెద యోగినేతలకటం చంతర్హితుండై చనెన్.

69


మ.

చనఁగా నంతట నిర్జరుల్ కడుఁగడున్ సంతుష్టులం జెందుచున్
జనుచుండంగ, సరోరుహోదరుఁడు నాశానాథులారా! ధరి
త్రిని శ్రీకాంతుఁడు దైత్యుఁ గూల్చ దృఢశక్తిన్ సేనలై యీరలుం
డనగు న్నాగను శైలచారు లయిరా నాకాధినాథుల్ దగన్.

70


క.

ఈలీల నిర్జరుల యం
శాలన్ ధరలో జనించి చక్కఁదనరు నా
శైలచరతనూజులు శౌ
ర్యాలంకృతు లగుచు నలరి రతిసంతుష్టిన్.

71


ఆ.

అందు నింద్రసుతుఁడు నర్కతనూజుండు
ననిలజుండు, ననిలతనయుఁ డధికు
లైరి, సరసిజోదరాంశాన జనియించె
తొల్లి ఋక్షరాజతులయశుండు.

72


ఆ.

ఇట్టి కీశులెల్ల రిందిరానాథుని
యధికకరుణచేత నలరి రంత

  1. 'యీశ్వరా' (ము) 'శ్వ' ఓష్ఠ్యము. (ఈశిత = ప్రభువు - శ.ర).