పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నదితీజారాతిఁగ్రిందికి నణగదన్నె
చెనటిరారేండ్ల నందర చేరిచెండె
నట్టి జగదేకకర్త శ్రీహరియె గల్గ
తెలియఁజాలక జాలి చింతించనేల.

78


25. క.

అని గద్దె డిగ్గి కై జేసిన
తనరాయంచ నెక్కి జేజేల జత
ల్తనచెంత నిలచిరాగాఁ
జని తెల్లనికడలి చేరసాగఁగ నచటన్.

79


28. సీ.

రాకాశశాంకనీరంధ్రచంద్రిక లెల్ల
             గలయ నేకాకృతిఁ గాంచె ననఁగ
నాళీకగేహినీనాథదేహచ్చాయ
             సకలాశ లందంగ సాగె ననఁగ
ద్రిదశసంతతి యెడతెగనీక సంతాన
             నగరాజి యంతట నాడె ననఁగ
హారహీరచ్చటాలర్థి దిన్నెలు సేసి
             జగతికి సరిగాగ జరచి రనఁగ
కానఁగానైన తెల్లనికడలిచెంత
నంచితాహ్లాదనియతి రాయంచ డిగ్గి
యష్టదిగ్రాజకీర్తన లతిశయిల్ల
సృష్టిరక్షణకర్త తా స్రష్ట నిలచె.

80


27. క.

నిలచినశతధృతి దిఙ్నే
తలు చేరలిడంగఁజేయ ధారన హరియా
హళహళికల్ హృదయస్థలి
బెలసి దయారసనిధానదృష్టి దనరఁగన్.

81


28. సీ.

శంఖచక్రగదాసిశార్ఙచిహ్నితదీర్ఘ
             కరశాఖ లత్యంతగళఁల దనర
శారదనీరదస్థలతటిల్లతికచం
             దాన గటెఁద లచ్చి కానరాఁగఁ