పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్యనయాచార దయాకళాతీశయ సారస్యక్రియల్ గన్న రా
చనెల ల్గల్గెదరయ్య యష్టహరిదీశశ్రేణి కీర్తించగన్.

59


6. క.

అన సంతసిల్లి దశరథ
జననాయకహేళి యంగజగతీవరరా
ట్తనయాసాంగత్యక్రియ
ననతస్థితి ఋష్యశృంగ యతిఁ దెచ్చెఁ దగన్.

60


7. ఆ.

ఆజిధరణినేత యతిఁ దెచ్చి నిజశాల
యందె టెంకి జేసి హర్షనియతి
యజ్ఞకరణదీక్ష నఖిలార్థసంఘట
నాతిశయత నిలచె నంతకంత.

61


8. క.

తనయాగరత్నచర్యల్
గనగా హరిదంత రాజఘనులను దగరా
ననిచిన నేతెంచిరి య
త్యానతానందరససిద్ధి యతిశయిలంగన్.

62


9. మ.

హరిగాంగేయశతాంగగంధగజసేనాధ్యక్షసంక్రాంతిచేఁ
గరఘంటానకకాహళాజలజఢక్కాతాళనిస్సాణజ
ర్ఝరనాదక్రియ లంతరిక్షసకలాశల్ ధాత్రియం దానఁగా
నరనేతల్ నగరిస్థలిన్ గలయనిండన్ సాగిరా నాయెడన్.

63


10. తే.

దశరథక్షితినాయక దంతినిష్ఠ
సంధిలగ గేహినీత్రయి చక్కనలర
యజ్ఞదీక్ష నధిష్ఠించె యాజియాజ్ఞ
శాస్త్రజనితార్థసత్క్రియల్ చక్కనలర.

64


11.క.

ఈగతి నిష్టి రచింప(చ)గ
సాగెన్ దశరథనృనేత చక్కఁగా సకలా
శాగతరజచ్ఛటల్ నా
లా గరసి యనేకచర్యలన్ గీర్తించన్.

65