పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జండతరహస్తశాఖల
నిండఁగఁ జరచిరి దిశాధినేత ల్గలఁగన్.

137


తే.

అసదృశస్యందనాధ్యాసియై దశాస్య
[1]నిర్జరారాతి గననయ్యె నింగిచాక
దాశరథి యంఘ్రిచారియై ధరణి నిలచె
దానికిని లేఖసంతతి తలఁకనంత.

138


చ.

అనికడదండి నిల్చిన దశాననరాక్షసకర్త సాహసా
త్యవతకళ ల్గణించి హృదయస్థలిఁ [2]గంధిధరాధరారి తా
పనిచె నిశాతసాయకశరాసనకీలికరాళశక్తిసా
ధనహయశాలి తేర ధనధాత్రికి సారథిచేత నయ్యెడన్.

139


క.

ఈరీతిం దెచ్చిన తే
రారసి చేరఁజని రాక్షసారాతి జయ
శ్రీ రంజిల్లఁగ నెక్కెన్
ధార నసదృశాచ్ఛదృష్టిఁ దనరఁగ నంతన్.

140


చ.

అలయక రాక్షసాహిత దశాస్యనిశాచర కర్త లిద్దఱల్
గలసి యహీనసారకరకాండశరాసనదీర్ఘశింజినీ
గళితకరాళశస్త్రికలఖండితచర్యల గాడగా నసృ
గ్జలకణధార లెల్లెడల జారఁగ నాజి రచించి రయ్యెడన్.

141


క.

నింగిన్ నిర్జరకర్తల్
జంగిలియై గణన సేయ సాహసగతిచే
జెంగక యాగ్రహదృష్టిన్
దంగక కలహించి రధికతర సంధిలచేన్.

142


ఉ.

ఆతఱిఁ దా నగస్త్యజటిలాగ్రణి రాఁ గని సంతసిల్లి య
త్యాతతశక్రనీలరచనాచ్ఛరథస్థలి డిగ్గి జానకీ
నేత ధరిత్రి సాగిలి గణించిన యాతని యంగయష్టికా
ఘాత లడంగరాచి హితకార్యరసస్థితి నాడెఁ జక్కఁగన్.

143
  1. నిర్జరాహతి (ము)
  2. గంధిధరారితా(ము)