పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కానగరస్థలిన్ సరసకాననఛాత్రి గృశాంగియైన యా
జానకి గంటి నం చరిగె జక్కఁగ గ్రద్ద నిజేచ్ఛ నయ్యెడన్.

131


క.

దిననాయకసారథినం
దననీడజచేత [1]ధరణి కన్యా
ఘనసరణిఁ దెలిసి చక్కఁగ
ననిలజహరి సంగడీల యాజ్ఞారతిచేన్.

132


సీ.

నింగికిఁ జక్కగా నెగిరి నిశ్చలత లం
             కారాజధానిఁ గదలికదలి
జలరాశి దేలిన శైలకన్యాసహ
             జాద్రియం దొకకేల నానియాని
యట్టకట్టిన యనిలాశనీజనని య
             త్యంతసత్కారాల నందియంది
యల్క సింహిక జఠరాంతస్స్థలి నిల్చి
             చెలఁగి గండ్రల్ గాఁగ జీరిచీరి
యంచితశ్రీలచే హెచ్చినట్టి యాత్రి
శృంగధరణీధరస్థలి జేరి చేరి
నంతనే చండదీధితి యస్తశిఖరి
గదిసె నెరసంజకెంజాయ లెదుఁగసాగె.

133


తే.

అంత గాఢాంధకారసంహతి యజాండ
కలశినిండిన గిరిచరకర్త ఋక్ష
సరణి కెగసి దశాననవారణారి
నగరి నతగాత్రయష్టియై నాచి కదిసి.

134


క.

తెలియక నదృశ్యగతిచే
గలయఁగ రాజగృహశాలఁ గరిహయరథశా
లల నగళల్ నింటింటన్
లలితక్రియఁ దిరిఁగితిరిఁగి లజ్జ ఘటిల్లన్.

135
  1. ధరణికన్యా (ము)