పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తనచేలాంచలనిర్గతానలశిఖాత్యంతాహతాకాశ ర
త్ననిశానాయక నాకదేశతటినీధారాధరారిన్ దగన్.

55


వ.

ఇట్లు జనకరాజధాని జేరనరిఁగి యా చక్రధరణీధరాంతరసకలదేశనర
నాథచ్ఛటలు, హరిశిఖికృతాంతనైరృతజలధీశా౽నిలచంద్రికానేతలు,
సిద్ధసాధ్యనాగచారణయక్షకిన్నరకర్తలు, గంధగజకంఖాణశితాంగ
సైనికసన్నాహచర్యలు నిండ శంఖకాహళఝల్లరీతాళానీకనిస్సాణ
ఘంటానాదలీలలు, దశదిశలఁ తెలంగ స్రక్చందనశాటికాచిరత్నరత్నా
లంకారక్రియలు రంజిల్లం దాల్చి సింహాసనస్థిరల నధిష్టించి రయ్యెడ.

56


క.

తనచెంత రానెలల్ సిరి
దనరఁగ నాగాధిరాజతనయాగ్రణి చ
క్కని నెఱసిరి గద్దెలకడ
నెనసి యధిష్ఠించె నంద ఱెన్నగ నంతన్.

57


చ.

కలితనయాతిశాలి, జనకక్షితినాయకహేళి చక్కఁగా
లలితహిరణ్యశాటిక లలంక్రియ లంచితగంధసేచనల్
గలిఁగి దిగంతరాజతతి గాంచి గణించఁగ లెక్కలేని చా
యల నలరార గద్దెకడ నక్కఱ సంధిల నిల్చె నయ్యెడన్.

58


క.

తనయంకస్థలి సీతాం
గన దిశలన్ నిండినట్టికళల నధిష్ఠిం
చిన సకలధరణినేతల్
గనిరి జగజ్జనని చాళికన్ దనరారన్.

59


తే.

అచట నీరితి జనకధరాధినేత
సకలసన్నాహచర్యల సంతసిల్లి
నిజగృహాంతరసంస్థితినీలకంఠ
ఘనశరాసనయష్టిఁ దే ననిచె నంత.

60


చ.

[1]కనకనగాకృతి న్నిగిడి, కానగనైన గిరీశసాయకా
సనదృఢయష్టిఁ జేరి, యతిసాహసశక్తి నిశాచరచ్ఛటల్

  1. కనఁగ నకాకృతి (ము)