పుట:దశకుమారచరిత్రము.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

301

     ఖ్యాతుఁడు ధర్మవర్మ యనఁగా నొకరాజు విదర్భరాజ్యసం
     స్ఫీతవిభూతి మైఁ గరము పెంపు వహించె నృపాల[1]కోటిలోన్.79
తే. జనుల భాగ్యదినంబులు చనినయట్ల
     యతనిదినములు చనుటయు నమరపురికి
     నరిగెఁ దత్సూనుఁడైన యనంతవర్మ
     రమణఁ బట్టంబుఁ గట్టె సామ్రాజ్యమునకు.80
క. అసమానబుద్ధివైభవ
     లసితుఁడు నృపనయవిచారలంపటుఁడు జన
     వ్యసనహరుఁడు గలఁ డొక్కఁడు
     వసురక్షితుఁ డనఁగ మంత్రివర్యుం డతనికిన్.81
వ. అయ్యమాత్యుండు తజ్జన్మసంభావితుండు గావున శిక్షకు
     నొడయం డగుటం జేసి యొక్కనాఁడు సముచితసమయం
     బున నమ్మహీవల్లభున కి ట్లనియె.82
చ. కులమును బెంపుఁ దేజము నకుంఠితబుద్ధియుఁ జారుమూర్తియుం
     గలిగి రసోజ్జ్వలంబులగు కార్యములం గొనియాడనేర్చి శ
     త్రులకు భయంకరం బయిన దోర్బలసంపద నుల్లసిల్లి స
     త్కళలఁ బ్రసిద్ధి బొంది నుతి గాంచితి వీవు మహీతలంబునన్.83
ఆ. వినుము రాజనీతివిద్యతాత్పర్యంబు
     చాల కునికి పూర్ణచంద్రులోనఁ
     గానవచ్చుచున్న కందున ట్లున్నది
     నీకు నిదియ కొఱఁత నృపకుమార!84

  1. కోటికిన్