పుట:దశకుమారచరిత్రము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

దశకుమారచరిత్రము

వ. అని యి ట్లూఱడిలం బలికి నీ వీజైనపల్లియ వసియింపు మని
     నియమించి యచ్చోటు వాసి నగరంబు దరియం జనిచని
     యొక్క యెడ నక్షధూర్తుల వెంటంగని యచ్చోటింబోయి.63
సీ. [1](ఇరవారు నిరువదియేను జూదములందు
                    నెనలేని నేర్పరితనము చూపి)
     క్రైయధికంబుగఁ గల్లసారెలు వైచి
                    యెక్కుదాయంబుల యెడలు గడపి
     యరుదైన తాలుకతనము పాసికలను
                    వలసినదాయంబు వైచికొనుచుఁ
     దప్పనాడినఁ గని తప్పార్ప వచ్చిన
                    లేదు లే దని తుది వాదు వెట్టి
తే. చావునకుఁ దెగినంతియ సంభ్రమించి
     సత్యములు సేసి సభికుల సాక్షి గోరి
     యంతఁ బోవక తద్వాదు లైనవారిఁ
     బాడి యడుగుచు మందట లాడియాడి.64
సీ. బలియుఁ డోడినధనములు గొనఁజాలక
                    పుడికిన(దానితోఁ) బోవువారు
     ననదలు గెలిచి వారడిగిన నేమియు
                    విడువక ధనములు వడయువారు
     నోడిన ధన మింక నాడినం గాని యేఁ
                    బెట్టఁ జూ పొమ్మని పెనఁచువారు

  1. ఈ కుండలీకృతభాగము వ్రాతఁప్రతిలో లేనందున మూలాధారమునఁ బూరింపబడినది.