40
తెలుగు వాక్యం
(110) | a. వాళ్లింటికి వెళితే సుజాత మంచి కాఫీ ఇచ్చింది. | |
2.33 : సంభావ్యమైన వ్యాపారాల మధ్యేకాని, సమాప్తినందిన వ్యాపారాల మధ్య చేదర్థ బోధకత లేదని దీనివల్ల తెలుసుకోవచ్చు. భూతకాలంలో సంభావ్యమైన వ్యాపారాలమధ్య చేదర్థం - (conditionality) బోధించాలంటే సమాప్తిని బోధించని క్రియారూపం ఉండాలి. అలాంటి క్రియ తెలుగులో లేనందువల్ల క్రియా జన్య విశేషణం మీద నిర్మించబడ్డ నామం ఉపయోగించ బడుతుంది. సంభావ్యమాన భూతకాల వ్యాపారాలతో చేదర్థకబోధ చేసేటప్పుడు ఉండు ధాతువును అను ప్రయుక్తం చేసినా అర్థంలో మార్పురాదు.
(111) | a. జ్వరం తగ్గితే కాలేజికి వచ్చేవాడు . | |
ఈ పైవాక్యాలన్నీ సమానార్థకాలు. వ్యతిరేక చేదర్థకానికి కూడా ఇట్లాంటి అవకాశమే ఉంది. ప్రధానవాక్యంలో ఆఖ్యాతానికి, నామానికి లాగే వ్యతిరేకరూపం ఉంటుంది. ప్రధాన ఉపవాక్యాల రెండిట్లోనూ వ్యతిరేక క్రియ ఉంటే ఈ వ్యతిరేకార్థం వస్తుంది. (111) లో వాక్యాల్లో వ్యక్తమయిన రెండు వ్యాపారాలు జరలేదు. కేవల సంభావ్యాలు. జరిగినదానికి, సంభావ్యానికి వైరుధ్యం (111) వాక్యాల్లో గమనించవచ్చు. భవిష్యత్క్రియా వాక్యాల్లో ఇట్లాంటి వైరుధ్యం ఉండదు.
2.34 : చేదర్థక క్రియ తరవాత కొన్ని ప్రత్యయాల్లాంటి ఆపదాలు ప్రయోగించవచ్చు. అప్పుడు ప్రధానక్రియ నామ్నీకృత మవుతుంది.
(112) | a. జ్వరం తగ్గితేనా వాడు కాలేజికి వచ్చేది ? | |
ఒక అర్థంలో (112) లో వాక్యాలు (111) లో వాక్యాలకు సమానార్థకాలు. “జ్వరం తగ్గలేదు. కాలేజికి రాలేదు ” అని. రెండోఅర్థంలో కేవల భవిష్యదర్థం ఈ భిన్నార్థబోధకతకి కారణం. (112) లో నామ్నీకృతమైన క్రియారూపం (111) లోని ప్రధాన వాక్యంలో క్రియ అయినా కావచ్చు. కేవల భవిష్యద్బోధక క్రియ అయినా కావచ్చు. (113) లో ఈ క్రమం చూపించబడుతుంది.