పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

51


సుఖము అనేసంగతి తెలుసుకొనవలయును. ఈదర్శనమునకు మొదట అనఁగా నార్జిత సేవలలో వివరింపఁబోవు పుళికాపుసే సలకు సొమ్ము చెల్లించువారిని లెఖ్కప్రకారము టిక్కెట్లు వేరే కొన నవసరము లేకుండఁగ వదలేదరు.అభిషేకముచే యించు గృహస్థులకు ఒకగిన్నెలో నభిషేకాపరిళముంచి ఇచ్చి మేళ తాళముతో పరిమెళమును సన్నిధిలోనికి తీసుకొని వెళ్లునపుడు వీరిని తీసుకొనికూడ నెళ్లెదరు. దీనిని గురించి యార్జిత సేవలలో వివరముగఁ జెప్పఁబడినది.

అభిషేక కాలములలో యాత్రికుల సౌకర్యమునకు గాను వృద్దులు, పిల్లలు లోపలకు ఈ దర్శనమునకు పోవుట మంచిది గాదని దేవస్థానము విచారణకర్తలవారు నోటీసు ప్రచురించియు న్నారు. దానిని యాత్రికులు బాగుగగమనించవలెను.

శ్రీవారికిముందు పాలతోను, దఱువాతఁదీర్ధముతోను అభిషేకమయి నూరిన కేసరి సమర్పణయయినవెనుక తిరుగఁ దీర్థముతో నభిషేకమవును. పసపుతో వక్షస్థల లక్ష్మియగు అమ్మవారికి అభిషేకమవును. వెంటనే నీరుతిరుమణి సమర్పించి పచ్చ కర్పూరము హారతి అయి నవనీతము, తాంబూలము ఆరగింపు కాగా యాత్రికులు బయటికి రావలెను.హారతి చీట్లుగల యాత్రికులు హారతి చేయించి బయటికివచ్చెదరు. మఱికొందఱు శ్రీవారి అభిషేక మైన తఱువాత నలంకారమునకు హారతులవ లన నాటంకము సేయుట యపచార మని హారతు లప్పుడు చే యించక అలంకార మయినతఱువాత దర్శన కాలమున జే