పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

కైంకర్యపరులయిన పెద్దజియ్యంగార్లును, ఇతర కైంకర్యపరులును కొందఱు జమీందారులును ఈ దేవస్థానం విచారణ కర్తృత్వము తమకు దయ చేయవలయునని కోరినను 1843 సంవత్సరము ఏప్రల్ నెల తే 21 దిలో ఆలోచన సభతో కూడిన మదరాసు గవర్నరు వారు అప్పటి శ్రీ హత్తిరాంజి మఠాధిపతీ వారైన శ్రీమహంతు శేవాదాసుజీ వారిని శ్రీ వేంకటేశ్వరస్వామి వారు వగైరా దేవస్థానము విచారణకర్తలగా అంగీకరించి వారి తదనంతరం వారి శిష్యులు ఎవరు వారిస్థానమును అలంకరించెదరో వారు దేవస్థానపు కార్యమును జరిపించవలయునని ఏర్పాటు చేసిరి. ఈ ఏర్పాటు ననుసరించి 1843 సంవత్సరం జూలై నెల తే 10ది నాడు శ్రీ మహంతు శేవాదాస్ జీ వారి పేరిట ఒక్క సన్నదుపుట్టి శ్రీ వేంకటేశ్వర స్వామి వగైరా దేవస్థానములును, వార్లకు చేరిన ఆభరణములు వస్త్రములు, వాహనములు, విగ్రహములు మొదలగు సొత్తులను వారిస్వాధీన పరచినందున తదాదిగ నీ దేవస్థానములు శ్రీ హత్తిరాంజిమఠము మహంతుల వారి విచారణకర్తృత్వమునకు లోబడి పరిపాలింపబడుచున్నవి.

ఈ దేవస్థానములకు 1907–వ వత్సరములో ప్రీవికౌన్సిల్ తీర్మానము ననుసరించి యొక స్కీము (Schemes) ఏర్పడినది. ఈస్టు ఇండియా కంపెనీ వారు ఈ దేవస్థానములు శ్రీమహంతుల స్వాధీనముచేసినది మొదలు ప్రస్తుతపు శ్రీవిచారణకర్తల వారయిన శ్రీమహంతు ప్రయాగ దాస్ జీ వారు ఆరవ విచారణ కర్తగా నున్నారు. స్కీము ఏర్పడిన తర్వాత మొదటివారు. వీరు 1900-వ సంహత్సరమున నీహాదాకు విచ్చేసి మరువర్షంబున మైనారిటి తీరిన తర్వాత స్వయముగా నధీకారము జూడ ప్రారం