పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర

అధ్యాయము. 1.

తిరుపతి:--

శ్రీపురమని సంస్కృతనామముచే వ్యవహరింపఁబడు తిరుపతి యనెడి పట్టణము చెన్నపురి రాజధానిలోఁ జిత్తూరు జిల్లాలోని మ్యునిసిపల్ పట్టణము. తిరుపతికొండలకును కార్వేటినగరము జమీందారిలో కొండలను వేఱుపఱచుచు మధ్యన నుండు విశాలమైన కనుమలో నీపురమున్నది. తిరుమలకుఁబోవు యాత్రికులు సదా ఉండుటచే నీపట్టణము జనముచే నిండియుండును. ఇప్పురము 1886వ వత్సరమున మ్యునిసిపల్ Municipal పట్టణముగా నియమింపఁబడెను. ఇక్కడ కొన్ని దేవస్థానములు గలవు. ఇవియు శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానము వలెనె శ్రీమహంతువారి విచారణకర్తృత్వములో నున్నవి. శ్రీవిచారణకర్తలవారిఖచేరియు, దేవస్థానము వల్ల నిర్మింపఁబడిన ఆయుర్వేద వైద్యశాలయు, పాఠశాలయు, సంస్కృత కాలేజియుఁ గలవు. ఇంకను మ్యునిసిపల్ హాసుపత్రియు, సబుమేజస్ట్రేటు ఖచేరి, జిల్లా మున్సిఫ్‌కోర్టు, సబ్ రిజిష్ట్రార్ ఖచేరి, పోలీస్ సర్కిల్ ఖచేరీలు గలవు. బాటసారులకు తాలూకా బోర్డువారి బంగళా (Travellers, bangalow) గలదు. అమెరికమిషన్ హైస్కూలు