పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

65

రూపదర్శనము, అభిషేకము నితంకాలములలోని గురుశుక్రవారముల వలన ధర్మదర్శనము లేక మునిషి రు 1 వంతున ఇచ్చి పారూపత్య దార్ ఖచేరిలో చీటి తీసుకొని లోపలకు వెళ్ల వలేను.

తొమ్మిదవ దివసము.______

1 సాలకీఉత్సవము.

2 చూర్ణాభిషేకమనే తిర్చి ఉత్సవము.

ఈ రెండున్ను శ్రీవారి మొదటఘంట అయినతఱువాత ఉదయము 7 ఘంటలలోపలఁ బూర్తి యవును. రెండవ ఉత్సవానంతరము శ్రీవరాహస్వామివారి సన్నిధిలో ఉభయ అమ్మ వారల సమేతం శ్రీవారికిన్నీ, చక్రత్తాళ్వారుకున్నూ తిరుము జనము జరిగి చక్రత్తాళ్వారికి మాత్రం పుష్కరిణిలో స్నానమయిన తఱువాత శ్రీవారు లోపలికి విజయంచేయఁగా శాత్తు మొర అయి ధర్మదర్శనమగును.

రాత్రి బంగారుతిర్చి ఉత్సవముయి ధ్వజావరోహణము జరగును. బ్రహ్మో త్సవ కాలములో శ్రీవిచారణకర్తలవారు తిరు మలమీఁదనే ఖచేరిచేసెదరు.

6 నవరాత్రోత్సవము.

చాంద్రమానరీత్యా అధికమాసము వచ్చినపుడు శ్రీవారి బ్రహ్మో త్సవము భాద్రపదమాసములో జరుగును. నవరాత్రుల లో ప్రత్యేకముగ నవరాత్రోత్సవము జరుగును.ధ్వజారోహణా వరోహణములును తేరుమాత్రము జరుగకనంతయు బ్రహ్మోత్స వమువలె నుండును. ఈ యుత్సవ కాలములో శ్రీవిచారణకర్తల

     5