పుట:తిరుపతి తిరుమల యాత్ర చిత్తూరు నరసింహదాసు 1924 53 P 199902071206 KK.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


కలియుగ వైకుంఠంబను తిరుపతి తిరుమల దివ్యక్షేత్ర మహాత్మ్యము .

శ్లో॥ వేంకటాద్రిసమం స్థానం బ్రంహాండేవాస్తి కించనః
వేంక టేశసమోజీవో నభూతో నభవిష్యతి

కథాక్రమంబెట్లనగా:--

నైమిశారణ్య ప్రకరణము,


అఖండ సచ్చిదానంద స్వరూపుండగు విరూపాక్షుణి కరుణా కటాక్షంబున ప్రపంచంబు సృజించు శక్తిని బొందిన చతురాననుం డగు బ్రహ్మదేవుండు పూర్వకాలంబున నొకదినము దేవతులందరున్ను తన్ను బరివేష్టింప హంసవాహనారూఢుడై సరస్వతీ సమేతుడై నిండు కొలువుండు తరినచటికి మునీంద్రులు కొందఱరుగుదెంచి సాష్టాంగ నమస్కారంబులాచరించి లేచినిలిచి బహువిధంబులు స్తుతించి తమ్మి పూగద్దియ నెక్కు. మేటీ దేవరవారి దివ్య పాదారవిందములే శరణం బుగాగ నందితిమి. మేము శ్రీమన్నారాయణనుగూర్చి యొక మేటి తపంబు సేయగోరి యున్న వారము. ఆతపంబెట్టి నిఘ్నంబు లేక నెఱ