పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-5 శంకరాభరణం సంపుటం: 11-431

పల్లవి: తగ దిఁకనూ నీ వెటు సేసిన తపములు ఫలియించె
         మగలవాఁడూ ప్రియములు చెప్పఁగ మంకులు లేవేఅమ్మా

చ. 1: అలుగుకువే వోచిలియా ఆతఁడు గరి గాఁడు
       వలవంతల నీలోఁ బొడమినవలపులు గురి గాని
       చలములు యింకా సాదించకువే జగడము పని లేదు
       వెలసిన నీ మొగమోటము లుండఁగ వెనక నేరరాదు

చ. 2: తడవకువే ఆతఁడు చేసినతప్పులు గురి గావు
       విడువక నీతనువునఁ బెనఁగెటివిరహము గురి గాని
       చిడుముడికి యిఁక నేఁటికి నీచేతికి లో నతఁడూ
       బడిబడినె నీవే అతనికిఁ బంత మియ్యఁ బడును

చ. 3: పెనగకువే శ్రీవెంకటేశ్వరు బీరము గురి గాదు
       కొన మొద లెంచుక మీలోఁ గూడినకూటమి గురి గాని
       వినియును వినకే సిగ్గులు వడియెడివెరగులు వని లేదూ
       ననిచిన నీసెలవులలో ముసిముసి నవ్వులు దొలఁకఁగను