పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-4 కేదారగౌళ సంపుటం: 08-298

పల్లవి:

నేఁడుగొత్తలా తన నేరుపులివి
వాఁడిపట్టి ముంటికొన వాదులడిచేనా

చ. 1:

కానిమ్మంటినే యిఁక గాదని యెదురాడనే
తానాడినదే మాట తప్పులులేవు
రానీవే యందుకేమి రతిఁ గరఁగించుఁ దాను
నానఁబెట్టీగొడ్డలి సన్నల నింతయేఁటికే

చ. 2:

బాసయిచ్చితినే తనపంతము చెల్లించేనే
సేసినదేచేఁత మరి చిక్కులులేవు
ఆసపడనీవె తాను అంబుధులు పేరఁబెట్టు
కోసి రాతనారొలిచి కూరిము లింతేఁటికే

చ. 3:

కూడితినే కాఁగిటను గురుతులు నించితినే
ఆడనీవే సరసాలు అంకెలాయనే
వేడుకవెలవెట్టె శ్రీ వెంకటేశ్వరుఁడు తాను
వీడెమిచ్చి బుజ్జగించీ వేసాలిఁకనేఁటికే